ఈ వర్షం మనల్ని కలుపుతుంది: ఇర్ఫాన్‌ భార్య | Irrfan Khan Wife Sutapa Sikdar Shares Emotional Note On Facebook | Sakshi
Sakshi News home page

‘కలువ పూలు నిన్ను గుర్తు చేస్తున్నాయి ఇర్ఫాన్‌‌’

Jun 22 2020 10:48 AM | Updated on Jun 22 2020 11:29 AM

Irrfan Khan Wife Sutapa Sikdar Shares Emotional Note On Facebook - Sakshi

ముంబై: బాలీవుడ్‌ దివంగత నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కు వర్షం, కలువ పూలు (తామర పువ్వు) అంటే చాలా ఇష్టమంటూ ఆయన భార్య సుతాప సిక్ధార్‌ సోషల్‌ మీడియాలో ఫొటోలను షేర్‌ చేశారు. అదే విధంగా ఇర్ఫాన్‌ కలువ పూల కోసం సృష్టించిన లోటస్‌ పాండ్‌ ఫొటోలను ఆదివారం తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసి భావోద్వేగ లేఖను పంచుకున్నారు. ‘ఈ కలువలు మిమ్మల్ని గుర్తు చేస్తున్నాయి ఇర్ఫాన్‌. వీటిని వికసించేలా చేయడానికి మీరు ఎంతగా తపించారో నాతో పాటు అవి కూడా చూశాయి. ఎండిపోతున్న కలువు పూలను సీసాలో తీసుకువచ్చి వాటి కోసం పాండ్‌ను నిర్మించడానికి ఎంతగా కష్టపడ్డారో’ అంటూ రాసుకొచ్చారు.  (నా భర్త నాతోనే ఉన్నాడు: ఇర్ఫాన్‌ భార్య)

మరో  పోస్టులో వర్షం పడుతున్న వీడియోతో పాటు ఇర్ఫాన్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘‘మీకు ధన్యవాదాలు.. ఈ చినుకుల శబ్థంలో నేను మిమ్మల్ని విన్నాను. అవును ఇది మీకు, నాకు మధ్య వారధి అని నాకు తెలుసు. అది నా శరీరాన్ని, ఆత్మను తాకింది. రెండు లోకాలలో ఉన్న మనిద్దరినీ ఈ వర్షం కలుపుతుంది’ అంటూ  భావోద్వేగానికి లోనయ్యారు.  విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ న్యూరో ఎండోక్రిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 29న మరణించిన విషయం తెలిసిందే. (ఇర్ఫాన్ ఖాన్‌‌ వీడియో షేర్‌ చేసిన బాబిల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement