మనసంతా ఇక్కడే... | I'm still a Delhi boy at heart: Sidharth Malhotra | Sakshi
Sakshi News home page

మనసంతా ఇక్కడే...

Apr 14 2014 11:40 PM | Updated on Sep 2 2017 6:02 AM

మనసంతా ఇక్కడే...

మనసంతా ఇక్కడే...

సినిమాల కోసం సిద్ధార్థ్ మల్హోత్రా దేశరాజధాని ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చినా.. సొంత నగరంపై మాత్రం ప్రేమ తగ్గలేదు. ముంబై తనను ఇంత వాడిని చేసినా,

 సినిమాల కోసం సిద్ధార్థ్ మల్హోత్రా దేశరాజధాని ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చినా.. సొంత నగరంపై మాత్రం ప్రేమ తగ్గలేదు. ముంబై తనను ఇంత వాడిని చేసినా, మనసంతా ఢిల్లీపైనే ఉంటుందన్నాడు. ‘కొత్త నటుల కోసం నిర్మాతలు వెతుకుతున్న సమయంలోనే ముంబైకి రావడం మంచిదయింది. ఇక్కడికి వచ్చాక నేనెంతో మారిపోయాను. నా వ్యక్తిత్వం మరింత పరిణతి చెందడానికి ముంబై ఎంతో ఉపయోగపడింది. ప్రతిభ ఉన్న వాళ్లకు ఇక్కడ అవకాశాలు సులువుగా దొరుకుతాయి. ఇలాంటి పరిస్థితే ఢిల్లీలోనూ ఉండాలని కోరుకుంటున్నాను. ఢిల్లీ సొంత నగరం కాబట్టి ప్రేమ ఉన్నా.. ముంబై కూడా గొప్పదే’ అని ఈ 29 ఏళ్ల యువనటుడు వివరించాడు.
 
 తన ముఖచిత్రమున్న మెన్స్ పత్రిక సంచికను ముంబైలో సోమవారం విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పాడు. ఆర్థిక రాజధానికి వచ్చిన కొత్తలో కొన్ని ఇబ్బందులుపడ్డా, బాగా శ్రమించడం వల్ల నిలదొక్కుకోగలిగానని సిద్ధార్థ్ అన్నాడు. ‘మనకంటూ ఎవరూ లేని నగరానికి వచ్చి నివ సించడం చాలా కష్టం. మొదట్లో ఇక్కడ నాకు ఎవరూ తెలియదు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులూ లేరు. వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగానూ సాయం దొరికేది కాదు’ అంటూ తను పడ్డ బాధలను ఈ సందర్భంగా మీడియాతో పంచుకున్నాడు.
 
 కాస్త ఓపిక ఉంటే ముంబైలో అన్నీ సాధించవచ్చని స్పష్టం చేశాడు. 2012లో విడుదలైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్  సిద్ధార్థ్ మల్హోత్రాకు తొలి సినిమా. డేవిడ్ ధవన్, ఆలియా భట్ కూడా ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. ఇటీవల హసీ తో ఫసీ కూడా విడులైనా, అది బాక్సాఫీసు వద్ద పెద్దగా ఫలితాలు రాబట్టలేదు. అయినా మనోడికి ఏక్ విలన్ అనే మరో సినిమాలో చాన్స్ వచ్చింది. ఇందులో సిద్ధార్థ్ విలన్ ఛాయలున్న పాత్రలో కనిపిస్తాడు. ఇతనికి జోడీ ఆషికీ 2 ఫేమ్ శ్రద్ధాకపూర్. జంట అదిరింది కదూ!
 

Advertisement
 
Advertisement
Advertisement