ఆల్ఫా మూవీపై ట్రోలింగ్.. కరణ్ జోహార్ ప్రశంసలు..! | Karan Johar Backs Alpha Amid Trolling And Mixed Box Office Response Praises Alia Bhatt, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Karan Johar: ఆల్ఫా మూవీపై ట్రోలింగ్.. కరణ్ జోహార్ ప్రశంసలు..!

Jul 5 2026 11:10 AM | Updated on Jul 5 2026 11:41 AM

Karan Johar backs Alpha amid trolling praises Alia Bhatt theatrical release

ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధానపాత్రలో వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్ ఆల్ఫా. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వస్తోంది. స్పై యూనివర్స్‌లో వచ్చిన మూవీ కావడంతో మరింత రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ భావించారు. కానీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.10 కోట్ల ఓపెనింగ్ వసూళ్లను నమోదు చేసింది. ఇండియాలో రూ.9.25 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా ఇండియాలో రూ.11.10 కోట్ల గ్రాస్ రాబట్టగా.. విదేశాల్లో  రూ.5 కోట్ల గ్రాస్ నమోదు చేసింది.

అయితే ఈ మూవీపై విమర్శలు వస్తున్న వేళ.. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన ఆరంభం అంటూ ఆలియా నటనను కొనియాడారు. సోషల్ మీడియాలో రెస్పాన్స్ కంటే ప్రేక్షకుల స్పందనే ముఖ్యమని జోహార్ అన్నారు. ఆల్ఫా లాంటి భారీ స్థాయి సినిమాలను ద్వేషంతో కాకుండా.. సానుకూల వైఖరితో అభినందించాలని ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇలాంటి సినిమాలను థియేటర్లలో ఆస్వాదించాలని ప్రేక్షకులను కోరారు.

కాగా.. ఈ చిత్రానికి శివ్ రావైల్ దర్శకత్వం వహించారు.  ఆదిత్య చోప్రా  నిర్మించిన ఈ చిత్రంలో శార్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్, హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. దియా మీర్జా కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఏడవ చిత్రం కావడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement