పదేళ్లల్లో పదో స్థానం | Hrithik Roshan named sexiest Asian male of the decade in UK | Sakshi
Sakshi News home page

పదేళ్లల్లో పదో స్థానం

Dec 6 2019 1:03 AM | Updated on Dec 6 2019 1:03 AM

Hrithik Roshan named sexiest Asian male of the decade in UK - Sakshi

ప్రభాస్‌, హృతిక్‌ రోషన్

బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్, టాలీవుడ్‌లో ప్రభాస్‌కి ఉన్న కామన్‌ విషయం, చూపు తిప్పుకోలేని లుక్స్‌. స్టయిలింగ్, ఫిజిక్‌ పరంగా ఫుల్‌ మార్క్స్‌లో ఉంటారెప్పుడూ. ఇప్పుడే అదే విషయాన్ని ఇంగ్లాండ్‌కి చెందిన ఈస్ట్రన్‌ ఐ మ్యాగజీన్‌ కూడా స్పష్టం చేసింది. ‘సెక్సియస్ట్‌ ఏషియన్‌ మేల్‌’ పేరుతో ప్రతి ఏడాది ఈ పత్రిక ఓ లిస్ట్‌ను విడుదల చేస్తుంది. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్, సినిమా రిలీజ్‌లు, ప్రపంచవ్యాప్తంగా పోల్‌ అయిన ఓట్లు అన్నింటి ఆధారంగా ఈ జాబితాను తయారు చేస్తారు.

ఈ ఏడాది రిలీజ్‌ చేసిన లిస్ట్‌లో మొదటి స్థానంలో హృతిక్, రెండో స్థానంలో షాహిద్‌ కపూర్, నాలుగు టైగర్‌ ష్రాఫ్, పదో స్థానంలో ప్రభాస్‌ నిలిచారు. బాలీవుడ్‌ స్టార్స్‌తో పోటీగా ప్రభాస్‌ కూడా లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం జాతీయ స్థాయిలో తన పాపులారిటీకి ఓ ఉదాహరణ. అలానే ఈ దశాబ్దపు జాబితానూ విడుదల చేసింది ఈస్ట్రన్‌ ఐ మ్యాగజీన్‌. ఇందులోనూ హృతిక్‌ మొదటిస్థానంలో, ప్రభాస్‌ 10వ స్థానంలో నిలిచారు. ఐదో స్థానంలో సల్మాన్‌ ఖాన్, ఆరు షాహిద్‌ కపూర్, ఎనిమిదో స్థానంలో రణ్‌బీర్‌ కపూర్, తొమ్మిదో స్థానంలో రణ్‌వీర్‌ కపూర్‌ చోటు సాధించారు. 

Advertisement
 
Advertisement
Advertisement