టిక్‌టాక్‌ వీడియో.. అమితాబ్‌, హృతిక్‌ ఫిదా | Hrithik Roshan Amitabh Bachchan Impressed TikTok Viral Video | Sakshi
Sakshi News home page

టిక్‌టాక్‌ వీడియో.. బాలీవుడ్‌ స్టార్లు ఫిదా

Jan 14 2020 12:15 PM | Updated on Jan 14 2020 6:35 PM

Hrithik Roshan Amitabh Bachchan Impressed TikTok Viral Video - Sakshi

ప్రస్తుతం యువతని ఉర్రూతలూగిస్తున్న అధునాతన యాప్‌ టిక్‌టాక్‌. దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా.. కోట్లాది మందికి వినోదాన్ని పంచుతోంది. వేలాది మందిని స్టార్లుగా కూడా మారుస్తోంది. యువత తమలోని ప్రతిభకు సానబెడుతూ సోషల్‌ మీడియా వేదికగా విజయాలు సాధిస్తూ..  ఒక్కసారిగా ఎదిగిపోతున్నారు. తమలో దాగిఉన్న ప్రత్యేకమైన స్టైల్‌, టాలెంట్‌కు టెక్నాలజీని జోడించి లక్షలాది మందిని ఫాలోవర్లుగా మార్చుకుంటూ సోషల్‌ మీడియా స్టార్స్‌గా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌లో ఓ వీడియా వైరల్‌గా మారింది. మైకేల్ జాక్సన్ స్టైల్‌లో ఉన్న ఓ యువకుడు చేస్తున్న డాన్స్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టకుంటోంది.

బాలీవుడ్‌ సూపర్‌ డాన్సర్‌గా పేరొందిన హృతిక్‌ రోషన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ వంటి బడా హీరోలను మంత్రముగ్దుడుని చేస్తున్నాయి అతడి అదిరే స్టేస్టెప్పులు. రీమిక్స్‌ సాంగ్స్‌కు అతడు వేసే స్టెప్పులు బాలీవుడ్‌ ప్రముఖులను కట్టిపడేస్తున్నాయి. హృతిక్‌ రోషన్‌, అమితాబ్‌, సునీల్‌ శెట్టి, అనుపమ్‌ ఖేర్‌ వంటి స్టార్లు అతడి డ్యాన్స్‌ వీడియాకి ఫిదా అయ్యారంటే మనోడి టాలెంట్‌ ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు. డాన్స్‌అదరగొట్టాడు అంటూ వీరంతా సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement