టాలీవుడ్ హీరోకు జరిమానా వేసిన కోర్టు | hero tanish fined 50 thousand rupees | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ హీరోకు జరిమానా వేసిన కోర్టు

Oct 6 2015 9:06 AM | Updated on Oct 2 2018 4:31 PM

టాలీవుడ్ హీరోకు జరిమానా వేసిన కోర్టు - Sakshi

టాలీవుడ్ హీరోకు జరిమానా వేసిన కోర్టు

న్యూసెన్స్ కేసులో సినీహీరో తనీష్‌కు నాంపల్లి కోర్టు సోమవారం రూ.50 జరిమానా విధించింది.

బంజారాహిల్స్: న్యూసెన్స్ కేసులో సినీహీరో తనీష్‌కు నాంపల్లి కోర్టు సోమవారం  రూ.50 జరిమానా విధించింది. తనీష్ ఈనెల 1న రాత్రి 9 గంటలకు మద్యం తాగి వాహనం నడుపుకుంటూ వెళ్తూ జూబ్లీహిల్స్ రోడ్ నెం.1/45 చౌరస్తాలో బైక్‌పై వెళ్తున్న సురేష్ అనే వ్యక్తిని ఢీకొట్టి ముందుకు దూసుకుపోయాడు.

బాధితుడు సురేష్ తన బైక్‌పైనే చేజ్ చేసి తనీష్‌ను అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాగిన మైకంలో తనీష్ తనను దుర్భాషలాడాడని ఆరోపిస్తూ సురేష్ అదే రోజు రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సురేష్ తనను దూషించాడని తనీష్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపైన జూబ్లీహిల్స్ పోలీసులు 70(బి) కింద న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే తనీష్ కోర్టుకు హాజరు కాగా న్యాయమూర్తి రూ. 50 జరిమానా విధించారు. తనీష్ వెంటనే జరిమానా చెల్లించి వెళ్లిపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement