గౌతమ్+నీలిమ=?! | gautam + neelima= movie shooting begin ? | Sakshi
Sakshi News home page

గౌతమ్+నీలిమ=?!

Jan 6 2014 12:26 AM | Updated on Sep 2 2017 2:19 AM

గౌతమ్+నీలిమ=?!

గౌతమ్+నీలిమ=?!

నరసింహనాయుడు, నువ్వునాకు నచ్చావ్, నువ్వులేక నేను లేను చిత్రాల్లో నటించిన బాలనటుడు అమిత్ కథానాయకునిగా

నరసింహనాయుడు, నువ్వునాకు నచ్చావ్, నువ్వులేక నేను  లేను చిత్రాల్లో నటించిన బాలనటుడు అమిత్ కథానాయకునిగా
 మారారు. ఆయన హీరోగా ‘గౌతమ్+నీలిమ=?!’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. గుజ్జల విష్ణువర్దన్ దర్శకుడు. నిస్సార్ బాషా, బి.పి.రాజు నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి వడ్డేపల్లి నరసింగరావు కెమెరా స్విచాన్ చేయగా, అస్మితాసూద్ క్లాప్ ఇచ్చారు. ఈ నెలాఖరున చిత్రీకరణ మొదలుపెట్టి, ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తి చేస్తామని ఏప్రిల్‌లో ఈ ముక్కోణపు ప్రేమకథను విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. 12 ఏళ్ల క్రితం బాలనటుణ్ణి అయిన తాను, హీరోగా అరంగేట్రం చేయడం ఆనందంగా ఉందని అమిత్ అన్నారు. ఇంకా కథానాయక నూర్జహాన్, రచయిత సుధీర్ పొలసాని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత షాహీ మొహిద్దీన్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ కవల.
 

Advertisement
 
Advertisement
Advertisement