గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లికి సిద్ధమైన హీరో!

Farhan Akhtar Plans To Tie Up With His Girl Friend In 2020 - Sakshi

‘భాగ్‌ మిల్కా భాగ్‌’తో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌.. తాజాగా మరోసారి పెళ్లికి సిద్ధమయ్యాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఫర్హాన్‌.. నటి షీబాని దండేకర్‌తో ప్రేమలో ఉన్నట్లు బీ-టౌన్‌లో వదంతులు ప్రచారమవుతున్నాయి. సోషల్‌ మీడియాలో వీరద్దరూ కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేయడంతో ప్రేయాణం గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఫర్హాన్‌, షిబానీలు 2020లో వివాహ బంధంతో ఒక్కటవ్వాలనుకుంటున్నారని.. ఫర్హాన్‌ తాజా చిత్రం  ‘తుఫాన్‌’ విడుదల అనంతరం పెళ్లి చేసుకుంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికీ పెళ్లి తేదీ ఖరారు కాలేదు గానీ.. పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని.. త్వరలోనే తమ బంధాన్ని బహిర్గతం చేయబోతున్నట్లు పేర్కొన్నాయి.

కాగా ఫర్హాన్‌.. షీబానీతో కలిసి ఉన్న ఫొటోలను తరచుగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. వీరిద్దరూ ఉంగరాలు ధరించి చేతులు పట్టుకొని ఉన్న ఫొటోలను  కూడా ట్వటర్‌లో షేర్‌ చేశారు. అయితే వారి నిశ్చితార్థం విషయంపై స్పష్టతనివ్వనప్పటికీ..వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా ఫర్హాన్‌ అక్తర్‌కు 16 ఏళ్ల కిందట హేర్‌ స్టైలిస్ట్‌ ఆదునా బబానీతో వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2016లో విడాకులు తీసుకున్న వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top