‘మహర్షి’ రిస్క్‌ చేస్తున్నాడా..? | Extra Scenes to be Added to Mahesh Babu Maharshi | Sakshi
Sakshi News home page

‘మహర్షి’ రిస్క్‌ చేస్తున్నాడా..?

May 14 2019 1:05 PM | Updated on May 14 2019 1:48 PM

Extra Scenes to be Added to Mahesh Babu Maharshi - Sakshi

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మహర్షి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. అయితే సినిమాకు యునానిమస్‌గా పాజిటివ్‌ టాక్‌ మాత్రం రాలేదు. ముఖ్యంగా సినిమా లెంగ్త్‌ విషయంలో విమర్శలు గట్టిగానే వినిపించాయి.

ఇలాంటి పరిస్థితుల్లో మహర్షి టీం మరికొన్ని సీన్స్‌ను యాడ్ చేసేందుకు రెడీ అవుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. హీరోయిన్‌ ఇంటికి రిషి (మహేష్ బాబు) వెళ్లే సీన్‌ నిడివి పెంచటంతో పాటు సెకండ్‌ హాఫ్‌లోనూ రెండు సన్నివేశాలను యాడ్ చేయనున్నారట. ఇప్పటికే లెంగ్త్‌ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న మహర్షి సినిమాకు రిపీట్ ఆడియన్స్‌ కోసం చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు వర్క్‌ అవుట్ అవుతుందో చూడాలి.

మహేష్‌ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన మహర్షి సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించినట్టుగా నిర్మాతలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో నాన్‌ బాహుబలి రికార్డుల మీద కన్నేసిన చిత్రయూనిట్ సినిమాను భారీగా ప్రమోట్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement