2.ఓలో సూపర్‌స్టార్ త్రిపాత్రాభినయం? | Enthiran sequel: Just one song in Rajinikanth's 2.0 | Sakshi
Sakshi News home page

2.ఓలో సూపర్‌స్టార్ త్రిపాత్రాభినయం?

Nov 2 2016 3:07 AM | Updated on Sep 4 2017 6:53 PM

2.ఓలో సూపర్‌స్టార్ త్రిపాత్రాభినయం?

2.ఓలో సూపర్‌స్టార్ త్రిపాత్రాభినయం?

రోజు రోజుకు అంచనాలను పెంచుతున్న చిత్రం 2.ఓ. కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

రోజు రోజుకు అంచనాలను పెంచుతున్న చిత్రం 2.ఓ. కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది సూపర్‌స్టార్ చిత్రం. దీనికి సృష్టికర్త బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్. ఈ రెండు ధ్రువాలు చాలు 2.ఓ చిత్రానికి క్రేజ్‌ను తెచ్చి పెట్టడానికి.అయితే పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఎందిరన్ చిత్రంలో రజనీకాంత్ వశీకరన్, చిట్టీ పాత్రల్లో నటించారు. ఆ చిత్రం అమోఘ విజయాన్ని సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 2.ఓ చిత్రంలో రజనీ అదనంగా మరో పాత్రలోనూ కనిపించనున్నారన్నది తాజా సమాచారం. ఈ పాత్ర కూడా రోబోనే నట.

ఎందిరన్ చిత్రంలోని చిట్టి(రోబో)పాత్ర కోడ్‌లతో కొత్తగా మరో రోబోను విలన్ అక్షయ్‌కుమార్ తయారు చేస్తారట. కాగా ఇందులో మరో విలన్‌గా బాలీవుడ్ నటుడు సుదన్‌షా పాండే నటిస్తున్నారు. ఈ విలన్‌లను వారు కనిపెట్టిన దుష్ట రోబోను నాశనం చేయడానికి రజనీకాంత్ మరో రోబోను సృష్టించి ఎలా వారిని మట్టుపెట్టారన్నదే 2.ఓ చిత్ర ఇతివృత్తం అని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఎమీజాక్సన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒకే ఒక్క పాట చోటు చేసుకుంటుందని తెలిసింది.

అయితే చిత్ర ఆల్బమ్‌లో మాత్రం ఆరు పాటలు ఉంటాయట. చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. లైకా ప్రొడక్షన్‌‌స సంస్థ 300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి నీరవ్‌షా చాయాగ్రహణం,  ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రం కోసం ఇటు చిత్ర పరిశ్రమ, అటు రజనీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement