breaking news
emijaksan
-
2.ఓలో సూపర్‌స్టార్ త్రిపాత్రాభినయం?
రోజు రోజుకు అంచనాలను పెంచుతున్న చిత్రం 2.ఓ. కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది సూపర్‌స్టార్ చిత్రం. దీనికి సృష్టికర్త బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్. ఈ రెండు ధ్రువాలు చాలు 2.ఓ చిత్రానికి క్రేజ్‌ను తెచ్చి పెట్టడానికి.అయితే పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఎందిరన్ చిత్రంలో రజనీకాంత్ వశీకరన్, చిట్టీ పాత్రల్లో నటించారు. ఆ చిత్రం అమోఘ విజయాన్ని సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 2.ఓ చిత్రంలో రజనీ అదనంగా మరో పాత్రలోనూ కనిపించనున్నారన్నది తాజా సమాచారం. ఈ పాత్ర కూడా రోబోనే నట. ఎందిరన్ చిత్రంలోని చిట్టి(రోబో)పాత్ర కోడ్లతో కొత్తగా మరో రోబోను విలన్ అక్షయ్‌కుమార్ తయారు చేస్తారట. కాగా ఇందులో మరో విలన్‌గా బాలీవుడ్ నటుడు సుదన్‌షా పాండే నటిస్తున్నారు. ఈ విలన్లను వారు కనిపెట్టిన దుష్ట రోబోను నాశనం చేయడానికి రజనీకాంత్ మరో రోబోను సృష్టించి ఎలా వారిని మట్టుపెట్టారన్నదే 2.ఓ చిత్ర ఇతివృత్తం అని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఎమీజాక్సన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒకే ఒక్క పాట చోటు చేసుకుంటుందని తెలిసింది. అయితే చిత్ర ఆల్బమ్‌లో మాత్రం ఆరు పాటలు ఉంటాయట. చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. లైకా ప్రొడక్షన్స సంస్థ 300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి నీరవ్‌షా చాయాగ్రహణం, ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రం కోసం ఇటు చిత్ర పరిశ్రమ, అటు రజనీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. -
అభిమానుల ప్రోత్సాహం మరువలేనిది
ఆరంభకాలం నుంచి అభిమానులందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని ఇలయదళపతి విజయ్ వ్యాఖ్యానించారు. ఈయన నటించిన 59వ చిత్రం తెరి. ముద్దుగుమ్మలు సమంత, ఎమీజాక్సన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని యువ దర్శకుడు అట్లీ దర్శకతలో వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించారు. ఇది ఆయనకు అర్ధ శత చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక రాయపేటలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. వందలాది మంది విజయ్ అభిమానుల ఈలలు, చప్పట్లు, కేరింతల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు విజయ్ మాట్లాడుతూ సాధారణంగా ఇలాంటి వేడుకల్లో సంగీత దర్శకులే హీరోలన్నారు. అయితే హీరో అయిన జీవీ ప్రకాశ్‌కుమార్‌నే ఆ చిత్రానికి సంగీత దర్శకుడు కావడం విశేషంగా పేర్కొన్నారు. జీవీ విర్జిన్ యువత హీరో అని వ్యాఖ్యానించారు. మహేంద్రన్ దర్శకత్వంలో అవకాశం కోసం ఇక దర్శకుల హీరోగా పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు మహేంద్రన్ అన్నారు. ఆయన పేరు చెప్పగానే గుర్తు కొచ్చే చిత్రం ముల్లుమ్ మలరుమ్ అన్నారు. ఉదిరిపూక్కళ్ లాంటి పలు గొప్ప చిత్రాలను తెరకెక్కించిన మహేంద్రన్ దర్శకత్వంలో నటించే అవకాశం రాదా? అను ఎదురు చూస్తుండగా ఆయనే తన చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. సెల్ఫీ పుళ్ల కుల్ఫీ పుళ్ల ఇందులో ఇద్దరు బ్యూటీఫుల్ హీరోయిన్లు నటించారన్నారు. వారిలో ఒకరు సెల్ఫీ పుళ్ల సమంత కాగా కుల్ఫీ పుళ్ల ఎమీజాక్సన్ మరొకరనీ అన్నారు. వీరిద్దరికీ సమాన పాత్రలని తెలిపారు. ఇకపోతే రాజారాణి వంటి అందమైన ప్రేమ కథా చిత్రంతో విజయం సాధించిన దర్శకుడు అట్లీ తనతో మంచి కమర్షియల్ చిత్రం చేయాలన్న వెర్రితో తీసిన చిత్రమే ఈ తెరి అన్నారు.ఆయన చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు. పులి లాంటి నిర్మాత మనం టీవీలో డిస్కవరి ఛానల్లో గుంపుగా ఉన్న జింకలో ఒక దానిపై గురి పెట్టిన పులి దాన్ని వెంటాడి చంపి తింటుందన్నారు. ఇక్కడ జింక విజయం అయితే దాన్ని వేటాడి సాధించే పులి నిర్మాత కలైపులి ఎస్.థాను అని వర్ణించారు. అలా విజయం కోసం వేటాడి సాధించే నిర్మాత ఆయనని అన్నారు. అభిమానులు ఉన్నత స్థాయికి ఎదగాలి ఇక తనకు ఆరంభ కాలం నుంచి అండదండగా నిలిచింది అభిమానులేనన్నారు. వారి ప్రోత్సాహంతోనే తానీ స్థాయికి చేరానన్నారు. తన అభిమానులూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నటి మీనా కూతురు నైనిక హైలైట్‌గా నిలిచారు. ఈ చిన్నారి తెరి చిత్రంలో విజయ్ కూతురుగా నటించింది. ఈ చిత్రం ఆడియోనూ తనే ఆవిష్కరించడం విశేషం. ఈ కార్యక్రమంలో నటి ఎమీజాక్సన్, మీనా, జీవీ ప్రకాశ్‌కుమార్,ప్రభు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.