ఆమె డ్యాన్స్‌ చూస్తే.. నిజంగానే పిచ్చెక్కుతుంది!! | Dhinchak Pooja New Song Naach Ke Pagal Viral | Sakshi
Sakshi News home page

ఆమె డ్యాన్స్‌ చూస్తే.. నిజంగానే పిచ్చెక్కుతుంది!!

Jul 31 2019 12:01 PM | Updated on Jul 31 2019 12:11 PM

Dhinchak Pooja New Song Naach Ke Pagal Viral - Sakshi

యూట్యూబ్‌ సెన్సేషన్‌ డించక్‌ పూజా మరో వీడియో సాంగ్‌ను నెటిజన్ల మీద వదిలారు. ఈసారి ‘పాగల్‌ హోకే నాచో ఔర్‌ నాచ్‌ కే పాగల్‌ హో జావో’  (పిచ్చివాళ్లలా డ్యాన్స్‌ చేయండి.. డ్యాన్స్‌ చేస్తూ పిచ్చోళ్లు అవ్వండి)అంటూ ఆమె లేటెస్ట్‌ ట్రాక్‌ను రిలీజ్‌ చేశారు. డించక్‌ పూజకు సోషల్‌ మీడియాలో అద్భుతమైన పాపులారిటీ ఉంది. దీంతో ఈ వీడియో పోస్టు చేసిన కొద్దిరోజుల్లోనే నాలుగు మిలియన్స్‌కుపైగా వ్యూస్‌ వచ్చాయి. డించక్‌ పూజా ఊహించినట్టే ఈ పాట సూపర్‌హిట్‌ అయింది.

అయితే, ఈ పాటను చూసిన నెటిజన్లే ఆగమాగం అవుతున్నారు. తనదైన కర్ణకటోరమైన గొంతుతో క్యాచీ పదాలతో ఒక శ్రుతి, లయ లేకుండా ఈ పాటను పాడింది పూజ. పాటకు తగ్గుట్టుగా చిత్రవిచిత్రమైన స్టెప్పులు కూడా వేసింది. అంతే ఈ వీడియోసాంగ్‌ను చూసిన నెటిజన్లు.. దీనిని టెర్రరిస్ట్‌ చర్యగా రిపోర్ట్‌ చేయడానికి అవకాశమివ్వాలంటూ యూట్యూబ్‌ను కోరుతూ ట్విటర్‌లో కామెంట్లు పెడుతున్నారు. ‘నేను అంతర్ముఖుడిని. నాకు ఎవరూ కాల్స్‌ చేయడం నచ్చదు. అందుకే డించక్‌ పూజ లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘నాచ్‌ కే పాగల్‌ హో జావో’ కాలర్‌ ట్యూన్‌గా పెట్టాను’ అని ఓ నెటిజన్‌ చమత్కరించారు. మరో కొత్త ఆయుధంతో డించక్‌ పూజ నెటిజన్లపై విరుచుకుపడ్డారని కామెంట్‌చేస్తున్నారు. మీరూ ఓసారి డించక్‌  పూజ లేటెస్ట్‌ సెన్సేషన్‌ను వీక్షించండి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement