రూ . 143 కోట్లు రాబట్టిన పద్మావత్‌ | Deepika-Shahid-Ranveer's epic drama earns Rs 143 cr | Sakshi
Sakshi News home page

రూ . 143 కోట్లు రాబట్టిన పద్మావత్‌

Jan 31 2018 6:16 PM | Updated on Jan 31 2018 6:18 PM

Deepika-Shahid-Ranveer's epic drama earns Rs 143 cr - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్‌ లీలా భన్సాలీ చెక్కిన చారిత్రక చిత్రం పద్మావత్‌ వివాదల నడుమ విడుదలైనా వసూళ్లలో దుమ్మురేపుతోంది. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పద్మావత్‌ దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ 143 కోట్లు కలెక్ట్‌ చేసిందని బాలీవుడ్‌ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

 ఓవర్సీస్‌లో తొలి వారాంతంలోనే రూ 76.24 కోట్లను కొల్లగట్టింది. రాజ్‌పుట్‌లు, హిందూ సంస్థల నిరసనల మధ్య విడుదలైన మూవీకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతుండటంతో చిత్ర యూనిట్‌ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. రాణీ పద్మావతిగా టైటిల్‌ రోల్‌లో దీపికా పదుకోన్‌ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ల నటనకూ మంచి ప్రశంసలు దక్కాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement