నేను గర్భవతిలా కనిపిస్తున్నానా అంటూ బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనే ఫైర్‌ | Bollywood Actor Deepika Padukone Fires On Rumours - Sakshi
Sakshi News home page

మీరు పర్మిషన్‌ ఇస్తే ప్లాన్‌ చేసుకుంటాం..

Jan 6 2020 12:35 PM | Updated on Jan 6 2020 1:01 PM

Deepika Padukone Says Ask You When I Will Plan Over Pregnancy Rumours - Sakshi

ముంబై: ‘నేను గర్భవతిలా కనిపిస్తున్నానా’ అంటూ బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనే ఫైర్‌ అయ్యారు. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘చపాక్‌’ సినిమా ప్రమోషన్లలో దీపిక బిజీగా ఉన్నారు. పలు రియాలిటీ షోలు, కార్యక్రమాలకు హాజరవుతూ అభిమానులతో సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా చపాక్‌తో పాటు తన తదుపరి సినిమాల గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఆదివారం నాటి ఓ కార్యక్రమంలో దీపిక మాట్లాడుతూ.. ‘షకున్‌ బాత్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్య పాండేతో కలిసి నటిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్‌ మార్చిలో ప్రారంభం అవుతుంది. ఇంకా టైటిల్‌ నిర్ణయించలేదు. అయితే 2021, ఫిబ్రవరి 12న సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం అని పేర్కొన్నారు. ఇక బిగ్‌బాస్‌ షోలో చపాక్‌ను ప్రమోట్‌ చేస్తారా అని విలేకరులు అడుగగా.. ఇందుకు సంబంధించి నిర్వాహకులతో ఎలాంటి చర్చ జరగలేదన్నారు.(వారితో ప్రత్యేకంగా దీపికా పుట్టినరోజు)
 

ఈ విధంగా దీపిక తన మూవీ బిజీ షెడ్యూల్‌ గురించి ఓపికగా వివరిస్తుండగా.. ‘మీరు గర్భవతట కదా’ అంటూ ఓ విలేకరి ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా... ‘ ఏంటీ నేను ప్రెగ్నెంట్‌లా కనిపిస్తున్నానా? నేనెప్పుడు తల్లిని కావాలో మీరే చెప్పండి. మీరు అనుమతి ఇస్తేనే మేం పిల్లల గురించి ప్లాన్‌ చేసుకుంటాం. ఒకవేళ నిజంగా గర్భవతిని అయితే దాచాల్సింది ఏముంటుంది. అందరికీ కనపడుతుంది కదా’ అని కౌంటర్‌ ఇచ్చారు. కాగా గతేడాది రణ్‌వీర్‌ సింగ్‌తో దీపిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తల్లికాబోతున్నారంటూ గత కొన్నిరోజులుగా బీ- టౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిని ఖండించిన దీపిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించి, నిర్మాతగా వ్యవహరించిన చపాక్‌ సినిమా జనవరి 10 విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement