రణ్‌వీర్‌ ఫొటోను చూడలేనంటున్న దీపిక!

Deepika Padukone Funny Comment On Ranveer Singh Childhood Photo - Sakshi

హీరో రణ్‌వీర్‌ సింగ్‌, బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌ల మధ్య ఉన్న రిలేషన్‌ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా రణ్‌వీర్‌ ఫొటోపై దీపికా చేసిన సరదా కామెంట్‌ అభిమానులను ఆకర్షిస్తోంది. రణ్‌వీర్‌ తన చిన్ననాటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. తను చిన్ననాటి నుంచి ప్రమోగాలు చేస్తూనే ఉన్నాననే అర్ధం వచ్చేలా ‘అవంత్‌ గార్డే సిన్స్‌ 1985’ అని జత చేశారు. దీనిపై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు స్పందించారు. అందరు రణ్‌వీర్‌ లుక్‌పై పలు రకాలుగా కామెంట్లు చేస్తుండగా.. దీపికా మాత్రం కాస్త వెరైటీగా స్పందించారు. నో... అంటూ ఈ ఫొటోని తను చూడలేనని అర్ధం వచ్చేలా ఓ ఎమోజీని ఉంచారు. ప్రస్తుతం దీపికా కామెంటు తెగ వైరల్‌గా మారింది. కాగా రణ్‌వీర్‌, దీపికాలు నవంబర్‌లో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.  
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top