కలర్స్ బ్యూటి కొత్త సినిమా | colours swathi New movie London babulu | Sakshi
Sakshi News home page

కలర్స్ బ్యూటి కొత్త సినిమా

May 6 2017 3:24 PM | Updated on Sep 5 2017 10:34 AM

బుల్లి తెర నుంచి వెండితెర మీదకు వచ్చి సత్తా చాటిన తెలుగమ్మాయి కలర్స్ స్వాతి. హీరోయిన్గా కెరీర్ స్టార్టింగ్లో మంచి

బుల్లి తెర నుంచి వెండితెర మీదకు వచ్చి సత్తా చాటిన తెలుగమ్మాయి కలర్స్ స్వాతి. హీరోయిన్గా కెరీర్ స్టార్టింగ్లో మంచి విజయాలు సాధించిన ఈ ముద్దుగుమ్మ తరువాత వరుస ఫ్లాప్లతో డీలా పడిపోయింది. ముఖ్యంగా త్రిపుర సినిమా ప్లాప్ స్వాతి జోష్కు బ్రేక్ వేసింది. తెలుగు, తమిళ సినిమాలు కూడా నిరాశపరచటంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న స్వాతి ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతోంది.

తమిళ సిమా రీమేక్తో టాలీవుడ్లో సత్తా చాటాలని భావిస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా కోలీవుడ్లో మంచి విజయం సాధించిన అందవన్ కట్టలై సినిమాకు రీమేక్గా టాలీవుడ్లో తెరకెక్కుతున్న లండన్ బాబులు సినిమాలో స్వాతి హీరోయిన్గా నటిస్తోంది. బి చిన్ని కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మారుతి టాకీస్ బ్యానర్పై మారుతి నిర్మిస్తున్నాడు. రక్షిత్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ట్రైలర్ త్వరలో విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు చిత్రయూనిట్.
 

Advertisement
 
Advertisement
Advertisement