సినిమాటోగ్రాఫర్ అశోక్కుమార్ కన్నుమూత | Cinematographer Ashok Kumar passes away | Sakshi
Sakshi News home page

సినిమాటోగ్రాఫర్ అశోక్కుమార్ కన్నుమూత

Oct 22 2014 8:29 AM | Updated on Aug 28 2018 4:30 PM

సినిమాటోగ్రాఫర్ అశోక్కుమార్ కన్నుమూత - Sakshi

సినిమాటోగ్రాఫర్ అశోక్కుమార్ కన్నుమూత

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ మరణించారు. ఆయన గత ఆరు నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ మరణించారు. ఆయన గత ఆరు నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని పలు ఆస్పత్రులలో గత ఆరు నెలలుగా ఆయనకు వివిధ చికిత్సలు అందించారు. ఆయన ఆరోగ్యం మరీ విషమించడంతో కొన్ని రోజుల క్రితమే ఇంటికి తీసుకొచ్చారు. పలు భారతీయ భాషల్లో దాదాపు వంద సినిమాలకు ఆయన కెమెరామన్గా పనిచేశారు. జీన్స్ లాంటి అద్భుతమైన చిత్రాలు ఆయన కెమెరా నుంచి జాలువారినవే.

1980లో 'నెంజాతై కిల్లాతె' అనే తమిళ చిత్రానికి గాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. సచ్చాప్యార్ లాంటి హిందీ, బ్యాక్ వాటర్స్ లాంటి ఇంగ్లీషు సినిమాలకు కూడా ఆయన సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. 1988లో తెలుగులో సంచలన విజయం సాధించిన ప్రేమకథా చిత్రం 'అభినందన' సహా కొన్ని తమిళ, హిందీ సినిమాలకు కూడా అశోక్ కుమార్ దర్శకత్వం వహించారు. భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలతో కలిసి ఆయన పనిచేశారు.

(ఇంగ్లీషు కథనం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement