వీడియోలు లీక్ చేస్తున్నాడంటూ నటి ఫిర్యాదు! | Bollywood actor Emraan Hashmi's co star Alisa Khan living on streets | Sakshi
Sakshi News home page

వీడియోలు లీక్ చేస్తున్నాడంటూ నటి ఫిర్యాదు!

Jun 10 2016 9:12 AM | Updated on Apr 3 2019 9:01 PM

వీడియోలు లీక్ చేస్తున్నాడంటూ నటి ఫిర్యాదు! - Sakshi

వీడియోలు లీక్ చేస్తున్నాడంటూ నటి ఫిర్యాదు!

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ జోడీ అలిసా ఖాన్ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. అలిసా, ఇమ్రాన్ 'మై హస్బెండ్స్ వైఫ్' అనే మూవీలో కలిసి నటించారు.

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ జోడీ అలిసా ఖాన్ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. అలిసా, ఇమ్రాన్ 'మై హస్బెండ్స్ వైఫ్' అనే మూవీలో కలిసి నటించారు. ప్రస్తుతం ఆమె దేశ రాజధాని వీధులలో  జీవనం సాగిస్తోంది. ఈ విషయాన్ని ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ లీక్ చేస్తున్నాడు. గ్రేటర్ కైలాశ్ వీధిలో ఆమె ప్రస్తుతం నివాసం ఉంటోంది. అలిసా తీరు, చేష్టలు నచ్చక ఇంట్లో వాళ్లు ఆమెను బయటకు పంపించేశారు. ఆమె మాజీ లవర్ ఈ విషయాలను ఓ వీడియో రూపంలో లీక్ చేశాడు. దీంతో నటి ప్రస్తుత పరిస్థితి వెలుగులోకి వచ్చింది.

వాస్తవానికి ఆమె తన ఫ్యామిలితో సహా ఘజియాబాద్ లో ఉండేది. అయితే 2010లో 'మై హస్బెండ్స్ వైఫ్' అనే మూవీలో అవకాశం రావడంతో నటించింది. అయితే ఇప్పటివరకూ ఆ మూవీ విడుదల కాలేదు. వీడియోలతో మాజీ బాయ్ ఫ్రెండ్ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అతడు లీక్ చేసిన వీడియోలు, తప్పుడు ప్రచారం వల్లే తన ఇంట్లోనే స్థానం కోల్పోయానని అలిసా చెప్పుకొచ్చింది. ఆమె  ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement