మా పెళ్లికి రండి.. | Bobby Simha-Reshmi Menon's wedding date announced | Sakshi
Sakshi News home page

మా పెళ్లికి రండి..

Apr 16 2016 2:50 AM | Updated on Apr 3 2019 9:14 PM

మా పెళ్లికి రండి.. - Sakshi

మా పెళ్లికి రండి..

మా పెళ్లికి రండి అనగానే ఇదేదో సినిమా పేరు అనుకునేరు. ప్రేమికులైన నటుడు బాబీసింహా, నటి రేష్మిమీనన్ వధూవరులుగా పెళ్లి పీటలెక్కనున్నారు.

తమిళసినిమా: మా పెళ్లికి రండి అనగానే ఇదేదో సినిమా పేరు అనుకునేరు. ప్రేమికులైన నటుడు బాబీసింహా, నటి రేష్మిమీనన్  వధూవరులుగా పెళ్లి పీటలెక్కనున్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మా పెళ్లికి రండి అంటూ బంధువులను, సన్నిహితులను,సినీ ప్రముఖులను ఆహ్వానిస్తూ శుభలేఖల పంపకంలో బిజీగా ఉన్నారు. కాదలిల్ సొదప్పవదు ఎప్పడి చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయిన బాబీసింహా ఆ తరువాత నేరం, జిగర్‌తండా చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించారు. జిగర్‌తంగా చిత్రంలో ఉత్తమ నటనకు గాను జాతీయ అవార్డును అందుకున్న బాబీసింహా ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నారు.

ఉరుమీన్ చిత్రంలో నటిస్తుండగా ఆ చిత్ర హీరోయిన్ రేష్మీమీనన్‌తో పరిచయం ప్రేమగా మారడం, వారి ప్రేమకు ఇరు కుటుంబ పెద్దలు పచ్చజెండా ఊపడంతో పెళ్లికి రెడీ అయ్యారు. వీరి పెళ్లి ఈ నెల 22న తిరుమలలో జరగనుంది. వివాహ రిసెప్షన్ 24వ తేదీన చెన్నై, వడపళనిలో గల గ్రీన్‌పార్క్ హోటల్‌లో నిర్వహించనున్నట్లు పెళ్లి పీటలెక్కనున్న బాబీసింహా, రేష్మీమీనన్ గురువారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. తిరుమలలో జరగనున్న బాబీసింహా, రేష్మీమీనన్‌ల వివాహానికి బంధుమిత్రులు, సన్నిహితులు హాజరుకానున్నారు. చెన్నైలో జరగనున్న రిసెప్షన్ వేడుకలో పలువురు సినీప్రముఖులు పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement