బిగ్‌బాస్‌: పార్కింగ్‌ చేయకుంటే నామినేట్‌.. | Bigg Boss 3 Telugu 12th Week Nomination Process Begins | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: పార్కింగ్‌ చేయకుంటే నామినేట్‌..

Oct 7 2019 3:35 PM | Updated on Oct 9 2019 7:06 PM

Bigg Boss 3 Telugu 12th Week Nomination Process Begins - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 పన్నెండో వారంలోకి అడుగుపెట్టింది. దీంతో ఈ వారానికి గాను నామినేషన్‌ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. దీనిలో భాగంగా ఇంటిసభ్యులందరికి బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎనిమిది మంది ఇంటిసభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో ట్రాలీ ఇచ్చి.. ఏడు పార్కింగ్‌ స్థలాలు మాత్రమే ఇచ్చాడు. అయితే సేఫ్‌గా పార్కింగ్‌ చేయలేని సభ్యులు ఈ వారం ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు నేరుగా నామినేట్‌ అవుతారు. అలా పార్కింగ్‌ స్థలాలు తగ్గిస్తూ ఉండటంతో నామినేషన్‌ ప్రక్రియ ముగిసేలా కనిపిస్తోంది. 

ఇక ఆదివారం ఎపిసోడ్‌లో నవరాత్రి వేడుకల సందర్బంగా హౌస్‌మేట్స్‌ నవరసాలను ప్రదర్శించారు దీంతో సండే కాస్తా ఫన్‌డే అయింది. వరుణ్‌ శాంత రసం, పునర్నవి శృంగార రసం, రాహుల్‌ భయాందోళన, శివజ్యోతి కరుణ, బాబా భాస్కర్‌ బీభత్సం, శ్రీముఖి రౌద్రం, మహేశ్‌ హాస్యం, అలీ వీరం, వితిక అద్భుత రసం పండించారు. అయిగిరి నందిని పాటకు శ్రీముఖి, కాంచన సినిమాలోని పాటకు బాబా భాస్కర్, ముత్యాలు వస్తావా పాటకు మహేష్ ప్రదర్శన అదిరిపోయింది. ఈ టాస్క్‌లో వీరి నటనే హైలెట్ గా నిలిచింది. వీరందరికీ వందకు వంద మార్కులు వచ్చాయి. 

కాగా, చివర్లో ఈ వారానికి గాను పునర్నవి ఎలిమినేట్‌ అయిందని నాగార్జున ప్రకటించడంతో ఇంట్లో ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. నాగార్జున పునర్నవి పేరు ప్రకటించడంతో రాహుల్‌ వెక్కివెక్కి ఏడ్చాడు. హౌజ్‌ నుంచి బయటికొచ్చిన పునర్నవి బిగ్‌బాస్‌లో తన జర్నీకి సంబంధించిన వీడియోను చూసి.. ఎమోషనల్ అయింది. పునర్నవి కోసం రాహుల్ ఒక పాట పాడాలంటూ హోస్ట్‌ నాగార్జున అడగ్గా.. పాడేందుకు అతను ప్రయత్నించాడు. అయితే, దుఃఖం ఆపుకోలేకపోయాడు. దీంతో పాట సాగలేదు. ఏడుపు ఆపుకుంటూ మళ్లీ పాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో బిగ్‌బాసే వెళ్లిపోమాకే.. అనే పాట ప్లే చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement