లాక్‌డౌన్‌ : వినూత్నంగా బిగ్‌బాస్‌ విన్నర్‌ పెళ్లి.. | Bigg Boss 2 Winner Ashutosh Kaushik Get Married On His Terrace At Noida | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ : వినూత్నంగా బిగ్‌బాస్‌ విన్నర్‌ పెళ్లి..

Apr 29 2020 10:30 AM | Updated on Apr 29 2020 1:25 PM

Bigg Boss 2 Winner Ashutosh Kaushik Get Married On His Terrace At Noida - Sakshi

న్యూఢిల్లీ : బిగ్‌బాస్‌ రియాలిటీ షో సీజన్‌ 2 విజేత అశుతోష్‌ కౌశిక్‌ ఓ ఇంటివాడయ్యాడు. అలీఘర్‌కు చెందిన అర్పితను ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. నోయిడాలోని అశుతోష్‌ ఇంటి టెర్రస్‌పై జరిగిన ఈ పెళ్లికి పురోహితుడు కాకుండా కేవలం నలుగురు అతిథులు మాత్రమే హాజరయ్యారు. వరుడి తల్లి, సోదరి, వధువు తల్లి, సోదరుడు ఈ పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అశుతోష్‌ తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. తన పెళ్లిని నిరాడంబరంగా జరుపుకోవడం ద్వారా ఆదా అయిన డబ్బులను పీఎం కేర్స్‌కు విరాళంగా ఇవ్వనున్నట్టు అశుతోష్‌ తెలిపారు. అయితే ఆ మొత్తం ఎంత అన్నది అతను వెల్లడించలేదు. అలాగే తన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా వస్తున్న మొత్తాన్ని కూడా చారిటీకి ఇవ్వనున్నట్టు చెప్పారు.

టెలివిజన్‌ రియాలిటీ షో స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అశుతోష్‌.. రోడిస్‌ సీజన్‌ 5, బిగ్‌బాస్‌ సీజన్‌ 2 టైటిల్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా తాను కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. పెళ్లి అనేది వ్యక్తిగత అంశమని.. దానికి పెద్ద సంఖ్యలో జనాలు, మ్యూజిక్‌, డ్యాన్స్‌లు ఎందుకని ప్రశ్నించారు. మరోవైపు ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతన్న నేపథ్యంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. కొందరు పెళ్లిలు చేసుకున్నప్పటికీ.. అతికొద్ది సమక్షంలో నిరాడంబరంగా జరుపుకుంటున్నారు.

చదవండి : 'ఇంకోసారి నోరు జారితే డెడ్‌బాడీ కూడా దొర‌క‌దు'

చిరు ఎంజాయ్‌ చేస్తున్న పాట ఇదే..

Advertisement
 
Advertisement
Advertisement