చిరు ఎంజాయ్‌ చేస్తున్న పాట ఇదే..

Chiranjeevi Enjoys You And Me Song With His Grand Daughter Navishka - Sakshi

ఇటీవలే సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి.. చాలా యాక్టివ్‌గా పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులపై స్పందించడమే కాకుండా, తన జ్ఞాపకాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల కాలంలో తాను ఓ పాటను బాగా ఎంజాయ్‌ చేస్తున్నానని నిన్న ట్విటర్‌లో పేర్కొన్న చిరు.. నేడు ఆ వివరాలు వెల్లడించారు.  ఖైదీ నంబర్‌ 150 చిత్రంలోని ‘మిమ్మీ మిమ్మీమి.. ఇకపై ఓన్లీ యూ అండ్ మీ’ పాట తను చాలా సార్లు విన్నానని తెలిపారు. ఈ పాటను పిల్లలు కూడా చాలా ఇష్టపడతున్నారని చెప్పిన చిరు.. ఆ పాటను తన మనవరాలు నవిష్క(శ్రీజ చిన్న కుమార్తె) ఎంతగా ఇష్టపడుతుందో తెలిపే వీడియోను షేర్‌ చేశారు. ఆ పాటను తిలకిస్తున్నప్పుడు నవిష్కతో కలిసి చిరు ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. 

‘నేను మ్యూజిక్‌కు ఉన్న శక్తి గురించి ఎప్పుడూ ఆశ్చర్యపోతాను. ఈ పాటకు కేవలం ఏడాది చిన్నారి ఎలా ఎంజాయ్‌ చేస్తుందో చూడండి. డ్యాన్స్‌ చేయడానికి ప్రయత్నించడమే కాకుండా ఎంతో ఆనందాన్ని పొందుతుంది. పాటను మధ్యలో ఆపి, మళ్లీ ప్లే చేస్తూ.. తనకు ఆ పాట నిజంగా ఇష్టపడుతుందా అని చూశాను. ఈ పాట నాది కాబట్టి, అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్‌ నాకే’ అని చిరు పేర్కొన్నారు.

చదవండి : సమంత బర్త్‌డే.. నాగచైతన్య సర్‌ఫ్రైజ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top