ప్రశాంత్‌తో ఆస్ట్రేలియా అమ్మడు | Australia beauty act with prasanth | Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌తో ఆస్ట్రేలియా అమ్మడు

Apr 11 2015 2:35 AM | Updated on Sep 3 2017 12:07 AM

ప్రశాంత్‌తో ఆస్ట్రేలియా అమ్మడు

ప్రశాంత్‌తో ఆస్ట్రేలియా అమ్మడు

జీన్స్ చిత్రంలో ప్రశాంత్‌తో అందాలరాశి ఐశ్వర్యారాయ్ రొమాన్స్ చేసిన విషయం ఆ చిత్రంతో ఆ జంట హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న

జీన్స్ చిత్రంలో ప్రశాంత్‌తో అందాలరాశి ఐశ్వర్యారాయ్ రొమాన్స్ చేసిన విషయం ఆ చిత్రంతో ఆ జంట హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదే ప్రశాంత్‌తో తాజాగా ఆస్ట్రేలియా అందగత్తె అమండా డ్యూయెట్స్ పాడుకోవడం విశేషం. చార్మింగ్ హీరో ప్రశాంత్ తాజాగా నటిస్తున్న భారీ చిత్రం సాహసం. పలు విశేషాలతో కూడిన ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందని స్టార్ మూవీస్ అధినేత సీనియర్ నటుడు త్యాగరాజన్ వెల్లడించారు. నవ దర్శకుడు అరుణ్‌రాజ్ వర్మ మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో నటించే హీరోయిన్ గురించి పలువురు ప్రముఖ నటీమణుల పేరు ప్రచారంలో ఉన్నాయి. దీంతో అసలు చిత్ర హీరోయిన్ ఎవరన్న రహస్యాన్ని నిర్మాత త్యాగరాజన్ శుక్రవారం బయటపెట్టారు. ఈ సందర్భంగా చిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరోయిన్‌ను హీరో ప్రశాంత్ పరిచయం చేశారు.

 ఆస్ట్రేలియా బ్యూటీ : హీరోయిన్ పేరు అమండా. ఆస్ట్రేలియా వాసి. తల్లి ఇండియన్, తండ్రి ఇంగ్లాడ్ దేశస్థుడు. 19 ఏళ్ల అమండా పెరిగింది ఆస్ట్రేలియాలో. అందం, అభినయం మెండు గా గల ఈమె ఒక బాలే డాన్సర్. ఈ నృత్యంలో పలు బహుమతులను గెలుచుకున్న ఈ బ్యూటీ నటనా పాఠశాలలో శిక్షణ పొందారు. ఈ సుందరికి సంబంధించిన కొన్ని వివరాలు ఇవి .

ఈ అవకాశం అదృష్టం : ప్రశాంత్ లాంటి ప్రముఖ హీరో సరసన నటించే అవకాశం రావడం నా అదృష్టం అని అమండా అన్నారు. కాగా ఈమె నటనను ఆ చిత్రంలో నటిస్తున్న మరో సీనియర్ న టుడు నాజర్ అభినందించారట. కోలీవుడ్‌కు లభించిన మరో చక్కని నటి అమండా అంటూ ప్రశంసలు పొందిన లక్కీ గర్ల్ అమండా.

సుదీర్ఘ అన్వేషణ ఫలం : సాహసం చిత్ర హీరో ప్రశాంత్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరోయిన్ కోసం చాలామందిని పరిశీలించామన్నారు. వందలాదిమంది అన్వేషణలో ఎంపికైన నటి అమండా అని అన్నారు. సాహసం చిత్రం కోసం అందం, అభినయం, నృత్యం తెలిసిన నటి అవసరం అయ్యారన్నారు. ఎనిమిది నెలల సుదీర్ఘ అన్వేషణ ఫలితం ఈ అమండా అని పేర్కొన్నారు. సాహసం చిత్రం విడుదలైనాంతరం అమండా గురించే ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటారన్నారు. పెద్ద పెద్ద సంభాషణలకు కూడా ఆమె బట్టీపట్టి చక్కగా చెప్పేశారన్నారు. ఈ చిత్రంలో ఇప్పటికే హాలీవుడ్ నటి నర్గీస్ బక్రి సింగిల్‌సాంగ్ ప్రశాంత్‌తో ఆడి దుమ్ములేపారు.

విదేశాలలో గీతాలు: తాజాగా ఈ ఆస్ట్రేలియా బ్యూటీ సాహసం చిత్రం కోసం 40 రోజులు నటించారు. ఇప్పుడు ప్రశాంత్‌తో కలిసి జపాన్, మలేషియా, కొరియా దేశాల్లో యువళగీతాలు పాడుకోవడానికి సిద్ధం అవుతున్నారు.

గ్రాండ్‌గా ఆడియో : ఎస్‌ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని త్వరలో చాలా గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత కథనం, సంభాషణల కర్త త్యాగరాజన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిత్రం కోసం పాడిన మోహిత్ చాహాన్ శ్రీయ ఘోషల్, శంకర్ మహదేవన్, సంగీత దర్శకుడు అనిరుద్, నటుడు శింబు, లక్ష్మీమీనన్, ఆండ్రియా పాల్గొననున్నారని తెలిపారు. చిత్రాన్ని మేలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement