హ్యాపీ హనీమూన్‌ | Arya and Sayesha Saigal Honymoon | Sakshi
Sakshi News home page

హ్యాపీ హనీమూన్‌

Mar 23 2019 3:09 AM | Updated on Mar 23 2019 3:09 AM

Arya and Sayesha Saigal Honymoon - Sakshi

సాయేషా

జీవితపు ఆనందక్షణాలను ఫొటోలలో దాచుకుంటున్నారు కోలీవుడ్‌ కొత్త దంపతులు ఆర్య, సాయేషా. ఈ నెల 10న ఈ ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట విదేశాల్లో హనీమూన్‌ను ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు సాయేషా. ‘‘సూర్యకాంతి సమక్షంలో మా ప్రేమను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాం.

ఇక్కడున్న ఫొటోలను నా భర్త (ఆర్య) తీశారు. హనీమూన్‌ జ్ఞాపకాలను మనసులోనే కాదు..  ఫొటోల్లోనూ దాచుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సాయేషా. ఇక సినిమాల విషయానికి వస్తే... పెళ్లికిముందు గజనీకాంత్, ‘కాప్పాన్‌’ సినిమాలో నటించారు సాయేషా, ఆర్య. ‘కాప్పాన్‌’ చిత్రంలో సూర్య హీరోగా నటించారు. పెళ్లి తర్వాత ఆర్య, సాయేషా జంటగా ‘టెడ్డీ’ అనే సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు శక్తిసుందర్‌ రాజన్‌ దర్శకత్వం వహిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement