ప్రభాస్‌తో మళ్లీ జతకట్టనున్న అనుష్క! | Anushka to pair again with prabhas in Saaho | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌తో మళ్లీ జతకట్టనున్న అనుష్క!

Jul 5 2017 9:47 PM | Updated on Sep 5 2017 3:17 PM

ప్రభాస్‌తో మళ్లీ జతకట్టనున్న అనుష్క!

ప్రభాస్‌తో మళ్లీ జతకట్టనున్న అనుష్క!

ప్రభాస్-అనుష్క జంట తెలుగు వెండి తెర మీద ఎవర్‌గ్రీన్ జంటగా పేరు తెచ్చుకుంది.

ప్రభాస్-అనుష్క జంట తెలుగు వెండి తెర మీద ఎవర్‌గ్రీన్ జంటగా పేరు తెచ్చుకుంది. బాహుబలితో భారీ విజయాలను అందుకున్న ఈ జంట తాజాగా మరో సినిమాలో అలరించబోతోంది. యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్‌లో ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టీజర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

దీపికా పదుకునే, కత్రినా కైఫ్, అనుష్క.. ఇలా పలువురి పేర్లు వినిపించినా చిత్ర యూనిట్ అయితే ఇప్పటి వరకు ఎవరినీ నిర్ధారించలేదు. తాజాగా తమిళ సినీ విశ్లేషకుడైన రమేష్ బాలా సాహో చిత్రంలో హీరోయిన్‌గా అనుష్కను తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. కాగా, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో  సాహో తెరకెక్కుతోంది. అయితే ఈ విషయంపై మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement