నాకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటా.. | anushka talk about her marriage | Sakshi
Sakshi News home page

నాకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటా..

Feb 6 2018 8:17 AM | Updated on Feb 6 2018 8:17 AM

anushka talk about her marriage - Sakshi

సాక్షి, సినిమా: నచ్చినోడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశ నాకూ ఉంది అంటోంది నటి అనుష్క. ఈ ముద్దుగుమ్మ గురించి ఇటీవల చాలానే వదంతులు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. బాహుబలి చిత్రం నిర్మాణ సమయంలో ప్రభాస్‌తో అనుష్క పీకల్లోతు లవ్‌లో మునిగిపోయిందనే ప్రచారం హోరెత్తింది. ప్రభాస్‌ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని అనుష్క స్పష్టం చేసింది. ఇటీవల భాగమతి చిత్ర విలేకరుల సమావేశంలో అనుష్క మాట్లాడుతూ నటుడు ప్రభాస్‌ తనకు మంచి ఫ్రెండ్‌ మాత్రమేనని నొక్కి వక్కాడించి చెప్పింది. 

మరోసారి తన పెళ్లి విషయమై ఈ బ్యూటీ స్పందిస్తూ, పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన అంశం అని పేర్కొంది. నచ్చినోడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశ తనకూ ఉందని చెప్పింది. అంతే కాదు పిల్లలంటే తనకు చాలా ఇష్టం అని, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలన్న కోరిక ఉందని, సరైన సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అంది. తన 20ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు సూచించారని, సమయం వచ్చినప్పుడు చేసుకుంటానని వారికి చెప్పానని అంది. భాగమతి చిత్రంలో మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి విమర్శకులను సైతం మెప్పించిన ఈ స్వీటీ చేతిలో ఒక్క చిత్రం కూడా లేదన్నది గమనార్హం. అయితే మంచి కథ అనిపిస్తేనే ఆ చిత్రాన్ని అంగీకరిస్తానని అనుష్క అంటోంది. దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చిత్రంలో చేయడానికి ఒప్పుకున్నానని అనుష్క ఇటీవల పేర్కొంది. అయితే ఆయన ఆమెతో ఎప్పుడు చిత్రం చేస్తారో? తెలియని పరిస్థితి. ఒక మల్టీస్టారర్‌ చిత్రం చేయడానికి గౌతమ్‌ మీనన్‌ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ చిత్రం గురించి అధికారికంగా సమాచారం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement