breaking news
gowtham menon
-
‘పతంగ్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: పతంగ్నటీనటులు: వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ఎస్పీబీ చరణ్, వడ్లమాని శ్రీనివాస్,విష్ణు ఓఐ, అను హసన్ తదితరులురచన, దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటినిర్మాతలు: విజయ్ శేఖర్ అన్నె, సంపత్ మాకా, సురేష్ రెడ్డి కొత్తింటి, నాని బండ్రెడ్డిసంగీతం: జోస్ జిమ్మిసినిమాటోగ్రఫి: శక్తి అరవింద్ఎడిటర్: చాణక్య రెడ్డి తూర్పువిడుదల తేది: డిసెంబర్ 25, 2025ఈ ఏడాది చివరి వారంలో తెలుగులో ఛాంపియన్, శంబాల, దండోరాతో పాటు మొత్తం ఎనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిల్లో ఒకటి పతంగ్. ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ బాగున్నప్పటికీ నటీనటులంతా కొత్తవారే కావడం.. ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయకపోవడంతో సినిమాపై బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. దీంతో ఎలాంటి అంచనాలు లేకుండానే డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘పతంగ్’ కథేంటంటే.. హైదరాబాద్‌లోని ఓ బస్తీకి చెందిన విజయ్ కృష్ణ అలియాస్ విస్కీ(వంశీ పూజిత్), అదే ప్రాంతంలో ఉండే రిచ్ కిడ్ అరుణ్(ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క రోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) ప్రవేశిస్తుంది. ఆమెది కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్. ఏ విషయంలో అయినా సొంతంగా, త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత అరుణ్‌ని ఇష్టపడుతుంది. ఆమె వల్ల ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్‌ల మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యను దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్‌ల పోటీ పెడతారు. ఇద్దరి మధ్య పతంగ్‌ల పోటీనే ఎందుకు పెట్టారు? ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. కొన్ని సినిమా కథలలో కొత్తదనం ఉండదు. అలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలే వచ్చి ఉంటాయి. అయినా కూడా తెరపై చూస్తుంటే ఎంజాయ్ చేస్తాం. అలాంటి సినిమానే పతంగ్. ఈ సినిమాలో చెప్పుకోవడానికి కథే ఉండదు. దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి ఎంచుకున్న ట్రయాంగిల్ లవ్‌స్టోరీ పాయింట్ కూడా చాలా రొటీన్. అయితే దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్‌గా, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆర్య, ప్రేమదేశం లాంటి ట్రైయాంగిల్ లవ్‌స్టోరీని హైదరాబాద్ స్టైల్లో చెబుతూ.. తనదైన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు దర్శకుడు ప్రణీత్. సన్నివేశాలు పాతవే అయితే.. డైలాగ్స్ ఫ్రెష్‌గా, యూత్‌ని ఆకట్టుకునేలా ఉంటాయి. అలా అని బూతు సంభాషణలు, సన్నివేశాలేవి ఇందులో ఉండవు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించారు.ఫస్టాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఐశ్వర్య-విస్కీల లవ్‌స్టోరీతో పాటు అరుణ్‌తో ఐశ్వర్య క్లోజ్ అయ్యేలా సాగే సన్నివేశాలన్నీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. అలా చూస్తుండగానే ఇంటర్వెల్ అవుతుంది. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కాస్త సాగదీతగా అనిపించినప్పటికీ.. పతంగ్‌ల పోటీ మొదలైన తర్వాత పరుగులు పెడుతుంది. సెకండాఫ్ కథ మొత్తం పతంగ్‌ల పోటీ చుట్టూనే తిరుగుతుంది. అయినా కూడా ఒక్క చోట బోర్ కొట్టదు. విష్ణు ఇచ్చే కామెంటరీ నవ్వుల డోస్‌ని మరింత పెంచేస్తుంది. ఇక ముగింపులో దర్శకుడు ఇచ్చిన సందేశం కూడా యువతను ఆలోచింపజేస్తుంది. మొత్తంగా కొత్త కథను ఆశించకుండా పతంగ్ సినిమాకు వెళ్తే మాత్రం రెండున్నర గంటల పాటు హాయిగా ఎంటర్టైన్ అవ్వొచ్చు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన నటీనటులంతా కొత్తవారే.అయినా కూడా చక్కగా నటించారు. హైదరాబాద్‌లోని బస్తీ యువకుడు విస్కీగా వంశీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రణవ్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రీతి పగడాల ఇందులో హీరోయిన్గా నటించింది.కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ ఉన్న ఐశ్వర్య పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. అరుణ్ చెల్లిగా నటించిన విజ్ఞాని తెరపై క్యూట్‌గా కనిపించింది. అరుణ్ తండ్రిగా నటించిన ఎస్పీ చరణ్.. ఎమోషనల్ సీన్లని బాగా పండించాడు. అరుణ్‌ని ఇష్టపడే లక్ష్మీ పాత్ర పోషించిన నటి కూడా బాగా చేసింది. ముఖ్యంగా పతంగ్‌లో పోటీలో ఆమె చేసిన డ్యాన్స్ నవ్వులు పూయిస్తుంది. అరుణ్-విస్కీల ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జోస్ జిమ్మీ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వెరైటీగా, ఆకట్టుకునేలా ఉంటాయి. బీజీఎం అదిరిపోయింది. శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. చిన్న సినిమానే అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
డిటెక్టివ్–2 తర్వాత మరో ప్రాజెక్ట్‌కు విశాల్ గ్రీన్ సిగ్నల్
కోలీవుడ్ నటుడు విశాల్ జయాపజయాలకు అతీతుడనే చెప్పాలి. 2023లో మార్క్ ఆంటోనీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన విశాల్ ఆ తర్వాత నటించిన రత్నం చిత్రం 2024లో విడుదలై పూర్తిగా నిరాశపరిచింది. అయితే ఆ లోటు భర్తీ చేసే విధంగా గత 12 ఏళ్ల క్రితం కథానాయకుడుగా నటించిన మదగజరాజా చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం విశాల్ డిటెక్టివ్–2 చిత్ర రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఇందులో కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. అదేవిధంగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఇంతకుముందు ఈటీ, ఐంగరన్ చిత్రాల ఫేమ్ రవి అరసు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. అయితే విశాల్ ముందుగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటిస్తారా, లేక రవి అరసు దర్శకత్వంలో నటిస్తారా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం విశాల్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న డిటెక్టివ్ –2 చిత్రం తర్వాతే మరో చిత్రంలో నటించే అవకాశం ఉంది. ఇకపోతే ఇటీవల విశాల్ అనారోగ్యానికి గురి కావడంతో ఆయనపై రకరకాల ట్రోల్స్ చేశారు. అయితే చాలా త్వరగా రికవరీ అయిన విశాల్ మళ్లీ షూటింగ్‌తో బిజీ కావడం ద్వారా తన గురించి కామెంట్ చేసిన వారికి స్ట్రాంగ్‌గా బదులు ఇచ్చారనే చెప్పాలి. -
సమంతకు లక్కీ ఛాన్స్.. హిట్ డైరెక్టర్‌తో అక్కడ తొలి సినిమా
సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ సమంతకు మరో లక్కీ ఛాన్స్ వరించిందన్నది తాజా సమాచారం. ఈమెకు నటిగా లైఫ్ ఇచ్చింది దర్శకుడు గౌతమ్‌మీనన్ అన్న విషయం తెలిసిందే. ఈయన దర్శకత్వంలో ఏమాయ చేసావే అనే తెలుగు చిత్రం ద్వారా సమంత నాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత సమంత తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యారు. కాగా ఇటీవల మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత నటనకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఖుషీ చిత్రం తరువాత ఈమె నటించిన చిత్రం ఏదీ తెరపైకి రాలేదు. ఇది ఆమె అభిమానులకు నిరాశ పరచే విషయమే అవుతుంది. తాజాగా దర్శకుడు గౌతమ్ మీనన్ నటి సమంతకు అవకాశం కల్పించినట్లు సమాచారం. అయితే ఇది తెలుగు, తమిళం చిత్రం కాదు. మలయాళం చిత్రం అన్నది గమనార్హం. దర్శకుడు గౌతమ్ మీనన్ తొలిసారిగా మాలీవుడ్‌లో చిత్రం చేయనున్నారు. ఇందులో మమ్ముట్టి కథానాయకుడిగా నటించి నిర్మించనున్నారు. ఈ చిత్రంలో సమంత నాయకిగా నటించనున్నట్లు తాజా సమాచారం. కాగా సమంతకు కూడా మలయాళంలో ఇదే తొలి చిత్రం అవుతుందన్నది గమనార్హం. ఇంతకు ముందు ఇందులో నటి నయనతార నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కారణాలేమైనా, ఇప్పుడీ అవకాశం నటి సమంతను వరించిందన్నమాట. ఈ చిత్రంతో సమంత చిన్న బ్రేక్ తరువాత రీ ఎంట్రీ అవుతున్నారన్న మాట. ఇది ఈ నెల 15వ తేదీన చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. కాగా నటి సమంత కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి, తనను కథానాయకిగా ప్రమోట్ చేసుకోవడానికి చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అది ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి. -
ఆయన కారణంగానే ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు'ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం: గౌతమ్ మీనన్
శింబు హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'వెందు తనిందదు కాడు'. ఇందులో సిద్దీ ఇధ్నానీ హీరోయిన్గా నటించింది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్. నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ విడుదల చేశారు. సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో తెలుగు మీడియాతో చిత్ర బృందం ముచ్చటించింది. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ ''తొలుత తెలుగులో ఈ సినిమా విడుదల చేయాలనే ఆలోచన లేదు. 'స్రవంతి' రవికిశోర్ గారు ఫోన్ చేశారు. 'నేను పాటలు విన్నాను. బావున్నాయి. ట్రైలర్ చూశా. నాకు నచ్చింది. తెలుగులో కూడా విడుదల చేద్దాం' అన్నారు. తమిళనాడులో ఒక పల్లెటూరిలో సినిమా కథ జరుగుతుంది. తెలుగులో విడుదల చేయాలనుకున్నప్పుడు... ఏ ఊరు అయితే బావుంటుంది? హీరో మాట్లాడే యాస ఎలా ఉండాలి? అని కొంత రీసెర్చ్ చేశాం. డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. సాధారణంగా నేను రివ్యూలు చదవను. కొన్ని రివ్యూలలో 'గౌతమ్ మీనన్ సినిమాల్లో హీరో బైక్ మీద తిరుగుతూ అమ్మాయితో పాటలు పాడుకుంటాడు' అని రాశారు. కానీ, ఈ సినిమాలో అవి ఏవీ లేవు. నేను ఇంతకు ముందు తీసిన సినిమాలకు డిఫరెంట్ సినిమా ఇది. శింబు కాబట్టి... సినిమాను ఇంత రియలిస్టిక్ గా చేశా. మరో హీరో అయితే స్టార్ డమ్, ఫ్యాన్స్ వంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని కొన్ని అంశాలు యాడ్ చేయాలి. శింబు అటువంటివి పట్టించుకోడు. నాకు అతనితో ఒక కంఫర్ట్ జోన్ ఉంది. సో... ఈజీగా చేశా. తమిళంలో పేరున్న రచయిత జయమోహన్ ఈ చిత్రానికి కథ అందించారు. ఆయన వైఫ్ కథ విని 'లవ్ స్టోరీస్ తీసే దర్శకుడికి లవ్ లేని కథ ఇచ్చావా?' అని అడిగారట. నాతో ఆ విషయం చెప్పేసరికి కథ నుంచి బయటకు వెళ్ళకుండా లవ్ సీన్స్ రాశాం. తెలుగు, తమిళ ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. దీనికి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. రెండు మూడు రోజుల్లో ఆ వివరాలు వెల్లడిస్తా. 'స్రవంతి' రవికిశోర్ గారి నిర్మాణంలో రామ్ హీరోగా వచ్చే ఏడాది ఒక సినిమా చేస్తాను. నిజం చెప్పాలంటే... ఆ సినిమా కోసం జయమోహన్ గారితో డిస్కషన్స్ చేస్తున్న సమయంలో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' కథ విని చేయడం జరిగింది. తెలుగులో సినిమా విజయం సాధించింది అంటే ఆ సక్సెస్ క్రెడిట్ ఆయనదే' అని అన్నారు. నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ ''గౌతమ్ మీనన్, నాకు మధ్య ఎప్పటి నుంచో పరిచయం ఉంది. మేం ఒక సినిమా చేయాలనుకుంటున్నాం. ఆ సినిమా చర్చలో మధ్యలో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' గురించి తెలిసింది. నిజం చెప్పాలంటే... తమిళ్ వెర్షన్ విడుదలయ్యే వరకూ నేను సినిమా చూడలేదు. నాకు పూర్తిగా తెలియదు. మొన్న సినిమా చూశా. ప్రేక్షకులను ఇన్ఫ్లూయెన్స్ చేయాలని కాదు గానీ... నాకు సినిమా బాగా నచ్చింది. ఇంతకు ముందు మా సంస్థ ద్వారా 'నాయకుడు', 'పుష్పక విమానం' , 'రెండు తోకల పిట్ట', 'రఘువరన్ బీటెక్' చిత్రాలు విడుదల చేశాం. ఆ సినిమాల తరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది'' అని అన్నారు. హీరోయిన్ సిద్ధీ ఇధ్నానీ మాట్లాడుతూ ''గౌతమ్ మీనన్ సినిమాలో కథానాయికగా నటించడం, ఈ రోజు ఆయన పక్కన కూర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో సినిమాను విడుదల చేసిన 'స్రవంతి' రవికిశోర్ గారికి థాంక్స్. శింబు, గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ కలిసి సినిమా చేస్తున్నారని తెలిసి మా మేనేజర్‌కి పోస్టర్ స్క్రీన్ షాట్ పంపించా. అప్పటికి నాకు అవకాశం వస్తుందని అనుకోలేదు. తర్వాత నాకు అవకాశం రావడంతో మాటలు రాలేదు. తెలుగులో కొన్ని సినిమాలు చేశా. కొంత విరామం తర్వాత ఈ సినిమాతో విజయం అందుకోవడం సంతోషంగా ఉంది' అని అన్నారు. -
అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీ.. అతడే డైరెక్టర్?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ ఎంట్రీపై ఓ కొత్త వార్త మీడియాలో షికార్లు చేస్తోంది. విలక్షణ సినిమాల దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో బన్నీ తమిళ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇద్దరి మధ్యా ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా యాక్షన్ డ్రామా లేదా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనుందంట. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కబోతుందంట. సికిందర్, ఆవారా సినిమాల దర్శకుడు లింగుస్వామి దర్శకత్వలో ఓ సినిమా చేయబోతున్నట్లు అల్లు అర్జున్ గతంలో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ( 'పుష్పరాజ్' వేట కేరళ అడవుల్లో..) ఇందుకు సంబంధించిన ఓ కార్యక్రమం కూడా చెన్నైలో జరిగింది. అయితే ఆ సినిమా పట్టాలెక్కకముందే ఆగిపోయింది. తర్వాత అల్లు అర్జున్ కోలివుడ్ ఎంట్రీపై చాలా వార్తలు వచ్చాయి. కానీ, అవేవీ నిజంకాలేదు. అయితే అల్లు అర్జున్ మాత్రం కోలివుడ్ ఎంట్రీపై ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మాలీవుడ్, కోలీవుడ్‌లలో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారనున్నారు. -
నాకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటా..
సాక్షి, సినిమా: నచ్చినోడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశ నాకూ ఉంది అంటోంది నటి అనుష్క. ఈ ముద్దుగుమ్మ గురించి ఇటీవల చాలానే వదంతులు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. బాహుబలి చిత్రం నిర్మాణ సమయంలో ప్రభాస్‌తో అనుష్క పీకల్లోతు లవ్‌లో మునిగిపోయిందనే ప్రచారం హోరెత్తింది. ప్రభాస్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని, అంతకుమించి తమ మధ్య ఏమీ లేదని అనుష్క స్పష్టం చేసింది. ఇటీవల భాగమతి చిత్ర విలేకరుల సమావేశంలో అనుష్క మాట్లాడుతూ నటుడు ప్రభాస్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని నొక్కి వక్కాడించి చెప్పింది. మరోసారి తన పెళ్లి విషయమై ఈ బ్యూటీ స్పందిస్తూ, పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన అంశం అని పేర్కొంది. నచ్చినోడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశ తనకూ ఉందని చెప్పింది. అంతే కాదు పిల్లలంటే తనకు చాలా ఇష్టం అని, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలన్న కోరిక ఉందని, సరైన సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని అంది. తన 20ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు సూచించారని, సమయం వచ్చినప్పుడు చేసుకుంటానని వారికి చెప్పానని అంది. భాగమతి చిత్రంలో మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి విమర్శకులను సైతం మెప్పించిన ఈ స్వీటీ చేతిలో ఒక్క చిత్రం కూడా లేదన్నది గమనార్హం. అయితే మంచి కథ అనిపిస్తేనే ఆ చిత్రాన్ని అంగీకరిస్తానని అనుష్క అంటోంది. దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రంలో చేయడానికి ఒప్పుకున్నానని అనుష్క ఇటీవల పేర్కొంది. అయితే ఆయన ఆమెతో ఎప్పుడు చిత్రం చేస్తారో? తెలియని పరిస్థితి. ఒక మల్టీస్టారర్ చిత్రం చేయడానికి గౌతమ్ మీనన్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ చిత్రం గురించి అధికారికంగా సమాచారం లేదు. -
మూడు పాత్రలలో మెప్పించడానికి రెడీ!
ఇద్దరూ ఇద్దరే. ఒకరు ప్రముఖ స్టైలిష్ దర్శకుడు గౌతం మీనన్. మరొకరు కోలీవుడ్ టాప్ స్టార్, యాక్షన్ హీరో అజిత్. సక్సెస్, ఫెయిల్యూర్లతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎవర్గ్రీన్ మాస్, కమర్షియల్ ఇమేజ్ ఉన్న హీరో అజిత్. ఈ ఇద్దరి కాంబినేషన్లో చిత్రం అంటే భారీ స్థాయిలోనే అంచనాలు ఉంటాయి. దానికి తోడు ఈ మూవీలో అజిత్ మూడు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు. చాలామంది హీరోలు ద్విపాత్రాభినయం చేస్తుంటారు. మూడు పాత్రలు పోషించడం చాలా అరుదు. అజిత్ మూడు పాత్రలలో కనిపించి మెప్పించడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో అజిత్ సరసన స్వీటీ అనుష్క, బ్యూటీ త్రిష హీరోయిన్స్‌గా కనిపించబోతున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా ప్రారంభమైన సమయంలో అజిత్ తెల్లజుట్టుతో ఉన్న ఫొటోలు వచ్చాయి. ఆ తర్వాత మంగాత్తా, వీరం, ఆరంభం... చిత్రాల్లో స్టైల్లోనే సాల్ట్పెప్పర్తో ఓ ఫొటో విడుదలైంది. ఆ తర్వాత అజిత్ చాలా స్మార్ట్‌గా, యువకుడిలా నల్ల జుట్టుతో ఉన్న ఫొటోలు విడుదలయ్యాయి. అవి అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు నల్లజుట్టు, గడ్డంతో ఉన్న మాస్ ఫొటో తాజాగా విడుదలైంది. అది ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. గతంలో వచ్చిన 'దీనా' చిత్రంలో ఉన్నట్లు అజిత్ కనిపిస్తున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు. దీపావళికి ఈ చిత్రం ట్రైలర్, పాటలను విడుదల చేసే అవకాశముందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు "తలా 55 " అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. ** -
మళ్లీ స్టైలిష్ లుక్‌తో అజిత్
అజిత్ మంచి అందగాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకుముందు ఈయన నటించిన కాదల్ మన్నన్, ఆశై, ముఖవరి చిత్రాలు యువతను అలరించాయి. ముఖ్యంగా మహిళాభిమానుల్ని పెంచాయి. ఆ తర్వాత అజిత్ యాంగ్రీయంగ్‌మెన్‌గా అవతారం ఎత్తారు. ఫైట్స్, పంచ్ డైలాగ్స్ అంటూ యాక్షన్‌లో దుమ్ము రేపారు. ఇటీవల సహజత్వానికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తన వయసుకు తగ్గ పాత్రలు ఎంపిక చేసుకుని నటించారు. మంగాత్త, ఆరంభం, వీరం వంటి చిత్రాల్లో చాలా రఫ్‌గా కనిపించారు. ఈ చిత్రాలు విశేష ప్రజాదరణను చూరగొన్నాయి. ఇలా కాలానుగుణంగా తనను మార్చుకుంటూ తనదైన శైలిలో నటిస్తున్న అజిత్ తాజాగా స్టైలిష్ లుక్‌తో తెరపైకి రానున్నారు. ఆరంభం వంటి ఘన విజయం సాధించిన చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అజిత్‌తో మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అజిత్ గత చిత్రాలకు భిన్నంగా స్టైలిష్ పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఆయన సరసన అందాల భామ అనుష్క హీరోయిన్గా నటించనున్నారు. ముఖ్య పాత్రలో అరవిందస్వామి నటించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 9న ప్రారంభం కానుంది. -
అజిత్‌కు షారూఖ్ సాయం
ప్రముఖ నటుడు అజిత్‌కు బాలీవుడ్ హీరో సా యం అందజేశారు. అదేం సాయం అనుకుంటున్నారా! వీరం చిత్రం తర్వాత దర్శకుడు గౌతం మీనన్ చిత్రంలో నటిస్తున్న అజిత్ ఇందుకోసం శరీర బరువు తగ్గించేందు కు ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకుని వ్యాయామం చేస్తున్నారు. అజిత్ కు వెన్నెముకలో సమస్య ఉన్నందున ఇష్టమొచ్చిన రీతిలో బరువులు ఎత్తేందుకు వీలులేదు. ఇందుకోసం ప్రత్యేకం గా ఒక ట్రెయినర్ కోసం అన్వేషించారు. ఈ విషయం తెలుసుకున్న హిందీ నటుడు షారుఖ్ ఖాన్ తన ట్రెయినర్‌ను అజిత్ ఇంటికి పంపారు. ఈ ట్రెయినర్ అజిత్ ఇంట్లోనే ఉంటూ శిక్షణ అందిస్తున్నారు.


