సమంతకు లక్కీ ఛాన్స్‌.. హిట్‌ డైరెక్టర్‌తో అక్కడ తొలి సినిమా | Samantha Get New Movie Chance With Top Director, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

సమంతకు లక్కీ ఛాన్స్‌.. హిట్‌ డైరెక్టర్‌తో అక్కడ తొలి సినిమా

Published Thu, Jun 13 2024 7:36 AM | Last Updated on Thu, Jun 13 2024 10:33 AM

Samantha Get New Movie Chance With Top Director

సౌత్‌ ఇండియా టాప్‌ హీరోయిన్‌ సమంతకు మరో లక్కీ ఛాన్స్‌ వరించిందన్నది తాజా సమాచారం. ఈమెకు నటిగా లైఫ్‌ ఇచ్చింది దర్శకుడు గౌతమ్‌మీనన్‌ అన్న విషయం తెలిసిందే. ఈయన దర్శకత్వంలో ఏమాయ చేసావే అనే తెలుగు చిత్రం ద్వారా సమంత నాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత సమంత తెలుగులో టాప్‌ హీరోయిన్‌ అయ్యారు. కాగా ఇటీవల మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత నటనకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఖుషీ చిత్రం తరువాత ఈమె నటించిన చిత్రం ఏదీ తెరపైకి రాలేదు. ఇది ఆమె అభిమానులకు నిరాశ పరచే విషయమే అవుతుంది. 

తాజాగా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ నటి సమంతకు అవకాశం కల్పించినట్లు సమాచారం. అయితే ఇది తెలుగు, తమిళం చిత్రం కాదు. మలయాళం చిత్రం అన్నది గమనార్హం. దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తొలిసారిగా మాలీవుడ్‌లో చిత్రం చేయనున్నారు. ఇందులో మమ్ముట్టి కథానాయకుడిగా నటించి నిర్మించనున్నారు. ఈ చిత్రంలో సమంత నాయకిగా నటించనున్నట్లు తాజా సమాచారం. కాగా సమంతకు కూడా మలయాళంలో ఇదే తొలి చిత్రం అవుతుందన్నది గమనార్హం. 

ఇంతకు ముందు ఇందులో నటి నయనతార నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కారణాలేమైనా, ఇప్పుడీ అవకాశం నటి సమంతను వరించిందన్నమాట. ఈ చిత్రంతో సమంత చిన్న బ్రేక్‌ తరువాత రీ ఎంట్రీ అవుతున్నారన్న మాట. ఇది ఈ నెల 15వ తేదీన చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. కాగా నటి సమంత కూడా సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి, తనను కథానాయకిగా ప్రమోట్‌ చేసుకోవడానికి చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అది ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement