
కోలీవుడ్ నటుడు విశాల్ జయాపజయాలకు అతీతుడనే చెప్పాలి. 2023లో మార్క్ ఆంటోనీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన విశాల్ ఆ తర్వాత నటించిన రత్నం చిత్రం 2024లో విడుదలై పూర్తిగా నిరాశపరిచింది. అయితే ఆ లోటు భర్తీ చేసే విధంగా గత 12 ఏళ్ల క్రితం కథానాయకుడుగా నటించిన మదగజరాజా చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం విశాల్ డిటెక్టివ్–2 చిత్ర రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఇందులో కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.
అదేవిధంగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. ఇంతకుముందు ఈటీ, ఐంగరన్ చిత్రాల ఫేమ్ రవి అరసు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది.
అయితే విశాల్ ముందుగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటిస్తారా, లేక రవి అరసు దర్శకత్వంలో నటిస్తారా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం విశాల్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న డిటెక్టివ్ –2 చిత్రం తర్వాతే మరో చిత్రంలో నటించే అవకాశం ఉంది. ఇకపోతే ఇటీవల విశాల్ అనారోగ్యానికి గురి కావడంతో ఆయనపై రకరకాల ట్రోల్స్ చేశారు. అయితే చాలా త్వరగా రికవరీ అయిన విశాల్ మళ్లీ షూటింగ్తో బిజీ కావడం ద్వారా తన గురించి కామెంట్ చేసిన వారికి స్ట్రాంగ్‌గా బదులు ఇచ్చారనే చెప్పాలి.