అనుష్క శర్మకు అరుదైన గౌరవం | Anushka Sharmas Talking Statue At Singapores Madame Tussauds Museum | Sakshi
Sakshi News home page

అనుష్క శర్మకు అరుదైన గౌరవం

Jul 11 2018 11:33 AM | Updated on Jul 11 2018 1:16 PM

Anushka Sharmas Talking Statue At Singapores Madame Tussauds Museum - Sakshi

ఓప్రా విన్‌ఫ్రే, పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో, లెవిస్‌ హామిల్టన్‌ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీల కంటే అనుష్క శర్మ చాలా ప్రత్యేకమట..

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మకు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ వ్యాక్స్‌ మ్యూజియంలో ఓప్రా విన్‌ఫ్రే, పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో, లెవిస్‌ హామిల్టన్‌ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీల మధ్య ఆమె మైనపు విగ్రహం కొలువు తీరనుంది. అయితే గతంలో ఇక్కడ ఉన్న మైనపు బొమ్మలకు, అనుష్క మైనపు విగ్రహానికి ఓ వ్యత్యాసం ఉందట. ఈ మేడమ్‌ టుస్సాడ్స్‌  మ్యూజియంలో మాట్లాడే అనుష్క మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. 

గతంలో ఇక్కడ కొలువుతీరిన మైనపు బొమ్మలతో ఆయా సెలబ్రిటీల అభిమానులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతున్నారు. అయితే అనుష్క ఫ్యాన్స్‌ మాత్రం తమ అభిమాన సెలబ్రిటీతో మాట్లాడుకునే అవకాశం కల్పించారు. అనుష్క మైనపు బొమ్మకు వద్ద ఏర్పాటు చేసిన ఫోన్‌ను పట్టుకుంటే అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తుంది. ప్రపంచంలో మరే ఇతర సెలబ్రిటీకి దక్కని అరుదైన గౌరవం తమ అభిమాన నటికి  సింగపూర్‌లో దక్కిందన్న విషయం తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
అనుష్క మైనపు విగ్రహంపై టుస్సాడ్స్‌ వ్యాక్స్‌ మ్యూజియం మేనేజర్‌ అలెక్స్‌ వార్డ్‌ మాట్లాడుతూ.. చాలా మంది అతిథులు, అభిమానులు, ఔత్సాహికులు ఇక్కడికి తరచుగా వస్తుంటారు. అనుష్క శర్మ మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారి కోరిక మేరకు, అనుష్కకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని మాట్లాడే మైనపు బొమ్మను ఏర్పాటు చేసి ఆమెను గౌరవించాలని భావించినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement