వేరే ప్రపంచంలో... | Sakshi
Sakshi News home page

వేరే ప్రపంచంలో...

Published Wed, Jul 1 2020 1:05 AM

Anu Emmanuel Speaks About Her Recent Favourite Books In Lockdown - Sakshi

‘‘ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో నిరాశకు గురి కాకుండా ఆశావహ దృక్పథంతో ఉండాలి. చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కోవాలి’’ అంటున్నారు అనూ ఇమ్మాన్యుయేల్‌. యూఎస్‌లో పుట్టి, పెరిగి హీరోయిన్‌ కావాలనే ఆలోచనతో ఇండియా వచ్చారు అను. తెలుగులో ‘మజ్ను’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘శైలజారెడ్డి అల్లుడు’ తదితర చిత్రాల్లో నటించారీ బ్యూటీ. తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఈ లాక్‌డౌన్‌లో ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడానికి కేటాయిస్తున్నానని అనూ ఇమ్మాన్యుయేల్‌ చెబుతూ – ‘‘మనం చదివే ప్రతి పుస్తకంలోనూ కొత్త కథ ఉంటుంది. అవి చదువుతున్నప్పుడు ఆ కథల్లో ఉన్న పాత్రల ప్రపంచంలోకి మనం వెళతాం. అలా వేరే ప్రపంచంలోకి వెళ్లడం బాగుంటుంది. షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడానికి కుదరదు. ఎన్ని పుస్తకాలు చదివితే అంత జ్ఞానం సంపాదించుకోవచ్చు’’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement