
జబర్దస్త్‌తో ఫేమస్ అయిన అనసూయ.. రంగమ్మత్త అంటూ వెండితెరపై అందర్నీ ఆశ్చర్యపర్చింది. యాంకరింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న అనసూయ.. నటిగాను సత్తా చాటుతోంది. క్షణం, రంగస్థలం లాంటి సినిమాలో నటించి.. మంచి పేరు సంపాదించుకుంది. అనసూయ ముఖ్యపాత్రలో నటిస్తున్న కథనం ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ.. ‘నాగార్జున గారు నా ఫెవరేట్ హీరో. ఆయన సినిమా పోస్టర్ (మన్మధుడు 2), నా సినిమా పోస్టర్ ఒకే రిలీజ్ టైమ్కి చూస్తాననుకోలేదు. ఇది ఆయనతో పోటీ పడటం కాదు.. పైగా రెండు చిత్రాలు వేర్వేరు జానర్స్. డబ్బుతో ముడిపెట్టి పెద్ద సినిమా, చిన్న సినిమా అనడం సరికాదు. ప్రేక్షకులకు నచ్చిందే పెద్ద సినిమా, నచ్చకపోతే అది సినిమానే కాదు. ధనరాజ్ వల్లే ఈ చిత్రంలో నటించాన’ని తెలిపింది. ఈ చిత్రాన్ని రాజేష్ నాదెండ్ల తెరకెక్కించారు.