అమితాబ్‌కు మళ్లీ అస్వస్థత | Amitabh Bachchan hospitalized again | Sakshi
Sakshi News home page

Feb 10 2018 8:40 AM | Updated on Oct 8 2018 5:45 PM

Amitabh Bachchan hospitalized again - Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (75) మళ్లీ ఆస్పత్రి పాలయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. 

గత కొంతకాలంగా ఆయన జీర్ణాశయ సమస్యలతోపాటు మెడ, వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో  వెన్నెముక కింది భాగంలో నొప్పిగా ఎక్కువ కావటంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. ‘‘లుంబార్ (నడుము కింది భాగం) ప్రాంతంలో నొప్పిగా ఉన్నట్టు అమితాబ్ చెప్పారు. కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి ఆపై డిశ్చార్జ్ చేశాం’’ అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

ఇక సినిమాలపరంగా అమితాబ్ ప్రస్తుతం ‘102 నాటౌట్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత మరో సీనియర్‌ నటుడు రిషి కపూర్ తో ఆయన స్క్రీన్‌ పంచుకున్నారు. ఇందులో రిషి అమితాబ్‌కు కొడుకు పాత్రలో కనిపించబోతున్నారు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓ గుజరాతీ నాటిక ఆధారంగా రూపొందుతోంది. మే నెలలో ‘102 నాటౌట్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement