మూవీ బజ్: ‘మహా’ బ్రాండ్ అంబాసిడర్ | Amitabh Bachchan appointed Maharashtra Horticulture brand ambassador | Sakshi
Sakshi News home page

మూవీ బజ్: ‘మహా’ బ్రాండ్ అంబాసిడర్

Jul 29 2014 1:10 AM | Updated on Oct 8 2018 6:22 PM

మూవీ బజ్: ‘మహా’ బ్రాండ్ అంబాసిడర్ - Sakshi

మూవీ బజ్: ‘మహా’ బ్రాండ్ అంబాసిడర్

గుజరాత్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.

గుజరాత్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. అమితాబ్‌ను తమ రాష్ట్ర ఉద్యాన రాయబారిగా నియమించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘మహా’ ఉద్యాన రాయబారిగా ప్రభుత్వ ప్రకటనల కోసం తీయించుకున్న ఫొటోలను బిగ్‌బీ ‘ట్విట్టర్’లో పోస్ట్ చేశారు.
 
 నేనూ, ఐన్‌స్టీన్.. సేమ్ టు సేమ్
 తనకు, విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు సారూప్యత ఉందని అమెరికన్ నటి పారిస్ హిల్టన్ చెబుతోంది. ఐన్‌స్టీన్‌లాగే తనది కూడా కుంభ రాశేనని, ఈ రాశి వారికి కలివిడితనం, మానవత్వం, తెలివితేటలు పుష్కలంగా ఉంటాయని జ్యోతిష పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తోంది. అయితే, ఐన్‌స్టీన్ మీనరాశిలో పుట్టినట్లు ఒక అమెరికన్ పత్రిక వెల్లడించడం కొసమెరుపు.
 
 సాండ్రా అమీకి బాలీవుడ్ చాన్స్
 తమిళనటి సాండ్రా అమీ బాలీవుడ్ చాన్స్ కొట్టేసింది. ఇమ్రాన్ హష్మీ త్వరలోనే తెరకెక్కించనున్న చిత్రంలో ఆమె ఒక చిన్న పాత్ర దక్కించుకుంది. అయితే, ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఆంథోనీ డిసౌజా దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో తాను ఇమ్రాన్ హష్మీ తమిళ గర్ల్‌ఫ్రెండ్ పాత్ర పోషించనున్నట్లు సాండ్రా చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement