బయటకు రాలేకపోయాను.. క్షమించండి! | Amitabh Bachchan Apologises to Fans | Sakshi
Sakshi News home page

బయటకు రాలేకపోయాను.. క్షమించండి!

Oct 21 2019 12:57 PM | Updated on Oct 21 2019 2:58 PM

Amitabh Bachchan Apologises to Fans - Sakshi

ముంబై: ప్రతి ఆదివారం ముంబైలోని అమితాబ్‌ బచ్చన్‌ ఇంటిముందు సందడి వాతావరణం కనిపిస్తుంది. బిగ్‌ బీ అమితాబ్‌ను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన అభిమానులు అక్కడ గుమిగూడుతారు. ఇంటి నుంచి బయటకు వచ్చి.. వారికి అభివాదం చేసి..అభిమానుల్ని అమితాబ్‌ ఖుషీ చేస్తుంటారు. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ.

ప్రతి ఆదివారం వేలమంది అభిమానులు ఆయన ఇంటి ముందుకు వచ్చి వేచి చూస్తుంటారు. నిన్న (ఆదివారం) కూడా ఎంతోమంది అభిమానులు బిగ్‌ బీ బంగ్లా ముందు గుమిగూడారు. ఎంతోసేపు వేచి చూశారు. అయినా అమితాబ్‌ బయటకు రాలేదు. అభిమనులను పలుకరించలేదు. ఇది ఫ్యాన్స్‌ను నిరాశ పరిచి ఉండొచ్చు. దీనిపై అమితాబ్‌ ట్విటర్‌లో స్పందించారు. తన ఇంటి ముందుకు వచ్చి తన కోసం వెయిట్‌ చేసిన అభిమానుల్ని పలుకరించనందుకు క్షమాపణలు చెప్పారు. తన కోసం వచ్చిన ఫ్యాన్స్‌ని కలువలేకపోయానని చెప్పారు. ప్రస్తుతం బిగ్‌ బీ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు. విశ్రాంతి తీసుకుంటుండటంతో ఆయన ఆదివారం తన అభిమానుల్ని పలుకరించేందుకు బయటకు రాలేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement