అక్షయ్‌కు థాంక్స్‌ చెప్పిన ఆమిర్‌ ఖాన్‌..! | Amir Khan Says Thank You To Akshay Kumar And Bachchan Pandey Director | Sakshi
Sakshi News home page

థాంక్యూ మై ఫ్రెండ్స్‌: ఇది రుజువైంది!

Jan 27 2020 1:17 PM | Updated on Jan 27 2020 6:56 PM

Amir Khan Says Thank You To Akshay Kumar And Bachchan Pandey Director - Sakshi

బాలీవుడ్‌ ‘కిలాడి’ అక్షయ్‌ కుమార్‌కు మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమీర్‌ ఖాన్‌ ధన్యవాదాలు తెలిపాడు. ఎందుకో తెలిస్తే మీరు కూడా అక్కీని పోగడ్తలతో ముంచెత్తుతారు. ఇక అక్షయ్‌ ఎదురుటివారికి సాయం చేయడంలో ముందుంటారన్న విషయం విదితమే. అంతేగాక తన తోటి నటులకు కూడా అవకాశం చిక్కినప్పుడల్లా తనవంతు సాయం చేస్తుంటుంటాడు ఈ ‘కిలాడి’. ఆమీర్‌ కోరిక మేరకు అక్కీ తన ‘బచ్చన్‌ పాండే’ సినిమా విడుదల తేదీని వాయిదా వేశాడట. అసలు విషయం ఏంటంటే అమీర్‌ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’  సినిమాను ఈ ఏడాది క్రిస్మస్‌కు డిసెంబర్‌ 25న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు చిత్ర యూనిట్‌. అదేవిధంగా ‘బచ్చన్‌ పాండే’ను కూడా అదే రోజున విడుదల చేయాలని దర్శకుడు సాజిద్ నాడియాద్వాలా, అక్షయ్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో వారి సినిమా విడుదల తేదీని మార్చు కోవాలని ఆమీర్‌, అక్షయ్‌ను కోరడంతో  ‘బచ్చన్‌ పాండే’ రీలిజ్‌ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

దీంతో అమీర్‌ ‘థ్యాంక్యూ మై ఫ్రెండ్స్‌... కొన్ని సార్లు ఎంతటి సమస్య అయినా మాట్లాడుకుంటే పరిష్కారమవుతుందంటారు. ఇప్పుడు అది రుజువైంది. నా విన్నపంను ఆహ్వానించి ‘బచ్చన్‌ పాండే’ విడుదల తేదీని వాయిదా వేసుకున్నందుకు అక్షయ్‌కి, సాజిద్ నాడియాద్వాలాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ ఆమీర్‌ ట్వీట్‌ చేశాడు. కాగా గతేడాది జులైలో అక్షయ్‌ ‘బచ్చన్‌ పాండే’ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేస్తూ...  సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్‌కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక దర్శకుడు సాజిద్ నాడియాద్వాలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ‘కిలాడి’కి జోడిగా కృతిసనన్‌ నటిస్తున్నారు. కాగా ‘లాల్‌ సింగ్‌ చద్దా’ ఆమీర్‌ సిక్కుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆమీర్‌కు జోడిగా బాలీవుడ్‌ భామ కరీనా కపూర్‌ నటిస్తున్నారు. హాలీవుడ్‌ చిత్రం ‘టామ్‌ హాంక్స్‌ ఫారేస్ట్‌ గంప్‌’ను దర్శకుడు హిందీలో రీమేక్‌ చేస్తున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement