అక్షయ్ తదుపరి ప్రాజెక్టు 'బ్రదర్స్'! | Akshay Kumar teams up with Karan Johar for next film | Sakshi
Sakshi News home page

అక్షయ్ తదుపరి ప్రాజెక్టు 'బ్రదర్స్'!

Aug 21 2014 7:10 PM | Updated on Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ తదుపరి సినిమాకు రంగం సిద్ధమైంది.

ముంబై: బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ తదుపరి సినిమాకు రంగం సిద్ధమైంది. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన కరణ్ జోహర్ ' బ్రదర్స్' చిత్ర నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ లో 2 నాటికి అక్షయ్ నటించే బ్రదర్స్ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి కరణ్ మల్హోత్ర దర్శకత్వం వహించనున్నారు. అక్షయ్ నటించిన ఎంటరైన్ మెంట్ చిత్రం తరువాత వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకునే చిత్రం ఇది.

 

ఇందులో సిద్దార్థ మల్హోత్ర, జాక్వీలైన్, జాకీ షరీష్ కీలక పాత్రలు పోషించనున్నారు. ప్రస్తుతం షకూన్ రీమేక్ లో కరణ్ మల్హోత్రా బిజీగా ఉన్నారు. అయితే కరణ్ జోహార్ కు సల్మాన్ ఖాన్ తో సినిమా సన్నద్ధమవుతున్నాడు. సల్మాన్ హీరోగా రూపొందబోతున్న శుద్ధి చిత్ర ఏర్పాట్లకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement