మేము ఇద్దరం కలిస్తే అంతే! | Akshay Kumar Gets Piggyback Ride On John Abraham | Sakshi
Sakshi News home page

‘అన్నాదమ్ములం కానీ తల్లి వేరు’

Aug 9 2019 6:51 PM | Updated on Aug 9 2019 7:41 PM

Akshay Kumar Gets Piggyback Ride On John Abraham - Sakshi

ముంబై : బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌, జాన్‌ అబ్రహంలు నటించిన మిషన్‌ మంగళ్‌, బాట్లా హౌస్‌ సినిమాలు ఈ నెల 15న విడుదల కానున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని గాసిప్ప్‌ గుప్పుమన్నాయి. అలాంటిదేమి లేదని ఈ ఇద్దరు హీరోలు తాజాగా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జాన్‌ అబ్రహం మాట్లాడుతూ.. ‘మీరు ఎప్పుడైన గమనించారా... పెద్ద హీరోల సినిమాలన్ని సెలవుల్లో లేదా పండుగ రోజుల్లో విడుదల చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలోనే ప్రేక్షకులు కుటుంబంతో కలిసి సినిమాకి వస్తారు. అందుకే నా సినిమాను సెలవు రోజున విడుదల చేస్తున్నాం. అక్షయ్‌ నాకు మంచి మిత్రుడు. మా ఇద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలవుతున్నంత మాత్రాన మా మధ్య విభేదాలు ఉన్నట్టు ప్రచారం చేయడం సరికాద’ని అన్నాడు.

అలాగే అక్షయ్‌ కుమార్‌ కూడా ఇదే విషయంపై మిషన్‌ మంగళ్‌ ట్రైలర్‌ ఫంక్షన్‌లో మాట్లాడుతూ.. ‘ఒక సంవత్సరంలో దాదాపు 210 పైగా హిందీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. సంవత్సరానికి 52 వారాలు మాత్రమే ఉంటాయి. ఈ లెక్కన చూసుకుంటే ఒకే రోజున రెండు సినిమాలు విడుదల కావడం పెద్ద విశేషం కాద’ని పేర్కొన్నాడు. తామిద్దం కలిసినప్పుడల్లా ఇలా అల్లరి చేస్తుంటామని జాన్‌ అబ్రహాం తనను భుజాలపై ఎత్తుకుని ఉన్న ఫోటోను అక్షయ్‌ కుమార్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ ఫోటోకి ‘బ్రదర్‌ ఫ్రమ్‌ అనెదర్‌ మదర్‌’ అని క్యాప్షన్‌ పెట్టాడు.

Advertisement
 
Advertisement
Advertisement