మెగా బ్యానర్‌లో అక్కినేని హీరో

Akhil Akkineni In Ram Charan Production - Sakshi

హీరో ఫుల్‌ బిజీగా కొనసాగుతూనే నిర్మాతగానూ వరుస సినిమాలు ప్లాన్‌ చేస్తున్నాడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌. ఇప్పటికే ఖైదీ నంబర్‌ 150తో సూపర్ హిట్ అందుకున్న చెర్రీ ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి చిరు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు.

కేవలం మెగా హీరోలతో మాత్రమే కాదు.. బయటి హీరోలతోనూ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు చరణ్‌. అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా తెరకెక్కిచేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ సినిమాను డైరెక్ట్ చేస్తున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే అఖిల్ సినిమా ఉండనుందన్న టాక్‌ వినిపిస్తోంది.

తొలి రెండు సినిమాలతో నిరాశపరిచిన అఖిల్ ప్రస్తుతం తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలె మిస్టర్‌ మజ్ను సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత బోయపాటి అఖిల్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇంకా కాంబినేషన్‌ పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top