టెంపర్ తరువాత మరోసారి | after temper ntr doing six pack for janatha garage | Sakshi
Sakshi News home page

టెంపర్ తరువాత మరోసారి

Mar 24 2016 1:36 PM | Updated on Nov 6 2018 4:55 PM

టెంపర్ తరువాత మరోసారి - Sakshi

టెంపర్ తరువాత మరోసారి

టెంపర్ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన ఎన్టీఆర్ తరువాత విడుదలైన నాన్నకు ప్రేమతో సినిమాతో 50 కోట్ల క్లబ్ చేరి సత్తా చాటాడు. ఈ రెండు సినిమాల సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న జూనియర్ ప్రస్తుతం...

టెంపర్ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన ఎన్టీఆర్ తరువాత విడుదలైన నాన్నకు ప్రేమతో సినిమాతో 50 కోట్ల క్లబ్ చేరి సత్తా చాటాడు. ఈ రెండు సినిమాల సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న జూనియర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల కూడా మిర్చి, శ్రీ మంతుడు సినిమాలతో వరుస విజయాలు సాధించి ఉండటంతో ఈ ఇద్దరు జనతా గ్యారేజ్ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ మీద కన్నేశారు.

అందుకు తగ్గట్టుగా అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. టెంపర్ సినిమాలో తొలిసారిగా సిక్స్ ప్యాక్ చూపించిన జూనియర్, జనతా గ్యారేజ్ సినిమా కోసం మరోసారి అదే లుక్లో దర్శనమివ్వనున్నాడు. అందుకే షెడ్యూల్ గ్యాప్లో సైతం రెస్ట్ తీసుకోకుండా జిమ్లో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఐఐటి చదివి, గ్యారేజ్ నడుపుతున్న వ్యక్తిగా కనిపిస్తున్న ఎన్టీఆర్ స్టూడెంట్ లుక్ కోసం స్లిమ్గా రెడీ అవుతున్నాడు. టెంపర్తో ఎన్టీఆర్కు సక్సెస్ అందించిన సిక్స్ ప్యాక్ లుక్, మరోసారి హిట్ ఇస్తుందేమో చూడాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement