నే తమిళ పాట పాడితే... | Aditi Rao Hydari sings her first Tamil song | Sakshi
Sakshi News home page

నే తమిళ పాట పాడితే...

Dec 6 2018 6:53 AM | Updated on May 29 2019 3:21 PM

Aditi Rao Hydari sings her first Tamil song - Sakshi

జీవీ ప్రకాశ్‌తో..అదితీరావ్‌ హైదరీ

కథానాయిక అదితీరావ్‌ హైదరి యాక్టింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘చెలియ, పద్మావత్, సమ్మోహనం’ వంటి చిత్రాలు అందుకు నిదర్శనం. ఇప్పుడు సింగింగ్‌లోనూ సత్తా చాటాలనుకుంటున్నారు. సంగీతదర్శకుడు జీవీ ప్రకాష్‌ హీరోగా నటించిన ‘జైలు’ సినిమాలో ఓ పాట పాడారామె. ఈ చిత్రానికి వసంతబాలన్‌ దర్శకుడు. ‘‘తమిళంలో నా తొలి సాంగ్‌ను రికార్డ్‌ చేసినందుకు ఆనందంగా ఉంది. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. నన్ను గైడ్‌ చేసిన జీవీ ప్రకాశ్‌కి ధన్యవాదాలు.

‘జైలు’ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు అదితీ. అలాగే స్టూడియోలో జీవీతో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారామె. సుధీర్‌బాబు ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఇంతకు ముందు బాలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సౌత్‌లో మంచి ఊపు మీద ఉన్నారు. తెలుగు ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పిహెచ్‌’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసిన అదితీ తమిళంలో ‘సైకో’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement