బోయపాటి సినిమాకు నిర్మాత మారాడా..? | Abhishek out of Boyapati srinu, Bellamkonda Film | Sakshi
Sakshi News home page

బోయపాటి సినిమాకు నిర్మాత మారాడా..?

Oct 26 2016 11:13 AM | Updated on Aug 3 2019 12:45 PM

బోయపాటి సినిమాకు నిర్మాత మారాడా..? - Sakshi

బోయపాటి సినిమాకు నిర్మాత మారాడా..?

మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన బోయపాటి, ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా...

మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన  సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన బోయపాటి, ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆసక్తి కరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే తాజాగా ప్రాజెక్ట్ నుంచి అభిషేక్ పిక్చర్స్ తప్పుకుందన్న వార్త టాలీవుడ్ లో మాట్ టాపిక్ గా మారింది.

దర్శకుడి రెమ్యూనరేషన్ విషయంలో వచ్చిన వివాదమే ఇందుకు కారణం అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాక ఒకే సారి నాలుగైదు సినిమాలను నిర్మిస్తున్న అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాపై పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేదన్న ఉద్దేశంతో బెల్లంకొండ శ్రీనివాస్ కావాలనే నిర్మాణ బాధ్యతలు వేరే వారికి అప్పగించారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇకపై కోన వెంకట్ తో కలిసి ఎల్ రవీంద్రారెడ్డి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకోనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement