చెప్పు శ్రీని.. కొత్త కోడలి వీడియో వైరల్ | After Marriage Bellamkonda Sreenivas And Kavya Latest Video | Sakshi
Sakshi News home page

బెల్లంకొండ కొత్త జంటని ఆటపట్టించిన ఫ్యామిలీ

May 1 2026 11:45 AM | Updated on May 1 2026 12:33 PM

After Marriage Bellamkonda Sreenivas And Kavya Latest Video

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ప్రియురాలు కావ్యని పెళ్లి చేసుకున్నాడు. బుధవారం రాత్రి తిరుమల వేదికగా ఈ శుభకార్యం జరిగింది. అనంతరం స్వామి వారిని దర్శించుకున్న నూతన వధూవరులు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ఇంటికి చేరుకునే సరికి చిన్నపాటి ఆటపట్టించడం లాంటివి జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. వీడియో వైరల్)

హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లయిన తర్వాత దంపతులిద్దరూ తమ పేర్లు చెప్పే ఇంట్లోకి అడుగుపెడతారు. బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి కూడా అలానే చేశారు. ముందుగా కొత్త కోడలు కావ్య మాట్లాడుతూ.. నేను కావ్య బెల్లంకొండ. మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలిగా వచ్చాను అని చెప్పింది. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ .. మా ఇంటికి మా ఆవిడని తీసుకొచ్చాను. మీరంతా ఏంటీ? జరగండి' అని నవ్వేశాడు. కావ్య కూడా తన భర్తను 'చెప్పు శ్రీని' అడగడంతో పాటు కుటుంబ సభ్యులు పట్టుబట్టేసరికి.. నా భార్య కావ్య బెల్లంకొండతో మా ఇంటికి వచ్చా. నా పేరు అల్లుడు శీను అని అనేశారు.

ఇకపోతే నిర్మాత బెల్లంకొండ సురేశ్ కొడుకు అయిన శ్రీనివాస్.. అల్లుడు శీను సినిమాతో నటుడిగా మారాడు. అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు గానీ చెప్పుకోదగ్గ హిట్స్ ఏం లేవు. గతేడాది 'కిష్కింధపురి'తో వస్తే ఇది యావరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం హైందవ, టైనస్ నాయుడు తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు కొరటాల కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement