ఎట్టకేలకు కొరటాల కొత్త సినిమా.. అధికారిక ప్రకటన | Koratala Siva Balakrishna Movie Announced | Sakshi
Sakshi News home page

Koratala Siva: రూమర్స్ నిజమయ్యాయి.. కాంబో ఫిక్స్

May 1 2026 11:07 AM | Updated on May 1 2026 11:15 AM

Koratala Siva Balakrishna Movie Announced

రైటర్ నుంచి డైరెక్టర్ అయిన తర్వాత వరసగా నాలుగు సినిమాలతో అద్భుతమైన హిట్స్ అందుకున్న కొరటాల శివ.. 2022లో 'ఆచార్య'తో మర్చిపోలేని డిజాస్టర్ చూశారు. దీని నుంచి బయటకొచ్చి 'దేవర' చేస్తే.. అది బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది. అయితే దీని సీక్వెల్ ఉంటుందా లేదా అనే కన్ఫ్యూజన్‌లో దాదాపు రెండేళ్లు అవుతున్నా కొరటాల నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇన్నాళ్లకు దీనికి ఎండ్ కార్డ్ పడింది. కొరటాల తర్వాత ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చేసింది.

(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. వీడియో వైరల్)

గత కొన్నిరోజుల నుంచి రూమర్స్ వచ్చినట్లే హీరో బాలకృష్ణతో కొరటాల శివ కలిసి పనిచేయబోతున్నారు. ఇది పొలిటికల్ కాన్సెప్ట్ మూవీ అని కొందరు అంటుంటే పక్కా యాక్షన్ కమర్షియల్ సినిమా అని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇద్దరూ కలిసి పనిచేయబోతున్నారని పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని కూడా పేర్కొన్నారు. చూస్తుంటే వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు.

బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనితో సమాంతరంగా కొరటాల మూవీ కూడా చేయబోతున్నారని తెలుస్తోంది. మరి బాలకృష్ణతో మూవీ చేసిన తర్వాతైనా కొరటాల 'దేవర 2' చేస్తారా లేదంటే దాన్ని అలా వదిలేస్తారా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: అషురెడ్డి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement