తిరుమలలో వైభవంగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం | Bellamkonda Suresh Married With Kavya Reddy At tirumala | Sakshi
Sakshi News home page

కావ్య మెడలో మూడుముళ్లు వేసిన బెల్లంకొండ శ్రీనివాస్‌

Apr 30 2026 7:24 AM | Updated on Apr 30 2026 7:44 AM

Bellamkonda Suresh Married With Kavya Reddy At tirumala

టాలీవుడ్‌ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు . తను ప్రేమించిన కావ్య రెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు. రెండు కుటుంబాల సమక్షంలో బుధవారం రాత్రి వారి వివాహం జరిగింది. తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఈ వేడుకలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

మే 1న హైద‌రాబాద్‌లో భారీ ఎత్తున రిసెప్షన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.  ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. హైదరాబాద్‌కు చెందిన  కావ్య రెడ్డి తండ్రి, తాత న్యాయ రంగ ప్రముఖలని తెలుస్తోంది.  బెల్లంకొండ శ్రీనివాస్‌ గతేడాది ‘కిష్కింధపురి’ చిత్రంతో హిట్‌ కొట్టాడు. . ప్రస్తుతం టైసన్‌ నాయుడు, హైందవ అనే ఆసక్తికరమైన రెండు ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement