ఆమిర్ ఖాన్ డబుల్ ధమాకా! | Aamir Khan double celebration on diwali occasion | Sakshi
Sakshi News home page

ఆమిర్ ఖాన్ డబుల్ ధమాకా!

Oct 30 2016 9:16 AM | Updated on Sep 4 2017 6:46 PM

ఆమిర్ ఖాన్ డబుల్ ధమాకా!

ఆమిర్ ఖాన్ డబుల్ ధమాకా!

బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ దీపావళికి డబుల్ సంబరాలు చేసుకుంటున్నాడు.

ముంబై: బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ దీపావళికి డబుల్ సంబరాలు చేసుకుంటున్నాడు. గత వారం విడుదలైన తన లేటెస్ట్ మూవీ ట్రైలర్ 'దంగల్' సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో వీక్షకులను సంపాదించుకుంది. యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఒక్క రోజులోనే దాదాపు కోటి మంది ఈ ట్రైలర్ వీడియోను చూశారు. రొటీన్ కు భిన్నంగా ట్రైలర్ ఉందని ప్రశంసలు రావడంతో ఆమిర్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. ట్రైలర్ సక్సెస్ తో పాటు దీపావళి వేడుకలను కొందరితో కలిసి సేలబ్రేట్ చేసే పనిలో ఆమిర్ బిజీగా ఉన్నాడు.

ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించాడు. ఈ మూవీ ట్రైలర్ సక్సెస్ ను బాలీవుడ్ నటులతో కలిసి ఆస్వాదించాలని డిసైడ్ అయ్యాడట. మూవీకి ప్రమోషన్ ఈవెంట్ తో పాటు పనిలో పనిగా దీపావళి వేడకలకు ఆమిర్ ఆతిథ్యం ఇస్తున్నాడు.

బాంద్రాలోని తన నివాసంలో ఆమిర్ రెండు సంతోషకర అంశాలను సెలబ్రేషన్స్ కు సిద్ధమయ్యాడు. ఆమిర్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్, అతడి భార్య అవంతికా మాలిక్, నితీశ్ తివారి, 'దంగల్'లో ఆమిర్ కుమార్తెలుగా నటిస్తున్న ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా ఈ దీపావళి వేడుకలలో సందడి చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement