breaking news
Dangal movie Trailer
-
ఆమిర్ ఖాన్ డబుల్ ధమాకా!
ముంబై: బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ దీపావళికి డబుల్ సంబరాలు చేసుకుంటున్నాడు. గత వారం విడుదలైన తన లేటెస్ట్ మూవీ ట్రైలర్ 'దంగల్' సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో వీక్షకులను సంపాదించుకుంది. యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఒక్క రోజులోనే దాదాపు కోటి మంది ఈ ట్రైలర్ వీడియోను చూశారు. రొటీన్ కు భిన్నంగా ట్రైలర్ ఉందని ప్రశంసలు రావడంతో ఆమిర్ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. ట్రైలర్ సక్సెస్ తో పాటు దీపావళి వేడుకలను కొందరితో కలిసి సేలబ్రేట్ చేసే పనిలో ఆమిర్ బిజీగా ఉన్నాడు. ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించాడు. ఈ మూవీ ట్రైలర్ సక్సెస్ ను బాలీవుడ్ నటులతో కలిసి ఆస్వాదించాలని డిసైడ్ అయ్యాడట. మూవీకి ప్రమోషన్ ఈవెంట్ తో పాటు పనిలో పనిగా దీపావళి వేడకలకు ఆమిర్ ఆతిథ్యం ఇస్తున్నాడు. బాంద్రాలోని తన నివాసంలో ఆమిర్ రెండు సంతోషకర అంశాలను సెలబ్రేషన్స్ కు సిద్ధమయ్యాడు. ఆమిర్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్, అతడి భార్య అవంతికా మాలిక్, నితీశ్ తివారి, 'దంగల్'లో ఆమిర్ కుమార్తెలుగా నటిస్తున్న ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా ఈ దీపావళి వేడుకలలో సందడి చేయనున్నారు. -
దుమ్మురేపుతున్న 'దంగల్' ట్రైలర్
బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ తాజా సినిమా 'దంగల్' ట్రైలర్ ఆన్ లైన్ లో దుమ్మురేపుతోంది. గురువారం విడుదలైన ట్రైలర్ కు ఆన్ లైన్ లో భారీ సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ లో ఇప్పటివరకు 89 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. రొటీన్ సినిమాకు భిన్నంగా ట్రైలర్ ఉందని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచార చిత్రం ప్రేరణ ఇచ్చేలా ఉందంటున్నారు. ఈ సినిమా ఆమిర్ ఖాన్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ రెజ్లర్ మహావీర్ పొగట్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించాడు. తన ఆశయాన్ని కూతుళ్ల ద్వారా సాధించాలనుకునే తండ్రి పాత్రలో అతడు ఒదిగిపోయాడు. యువ మహావీర్ గా కూడా అతడు కనిపించనున్నాడు. అతడు పడిన కష్టం అంతా దంగల్ ట్రైలర్ గా స్పష్టంగా కనపడింది. నితీశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 23న విడుదలకానుంది.