ఇక ‘గీతాంజలి’కి సీక్వెల్ | A Sequel for 'Geethanjali' | Sakshi
Sakshi News home page

ఇక ‘గీతాంజలి’కి సీక్వెల్

Dec 17 2014 10:33 PM | Updated on Sep 2 2017 6:20 PM

ఇక ‘గీతాంజలి’కి సీక్వెల్

ఇక ‘గీతాంజలి’కి సీక్వెల్

అంజలి కథానాయికగా రాజ కిరణ్ దర్శకత్వంలో రూపొందిన హారర్, కామెడీ చిత్రం ‘గీతాంజలి’కి సీక్వెల్ రానుంది.

 అంజలి కథానాయికగా రాజ కిరణ్ దర్శకత్వంలో రూపొందిన హారర్, కామెడీ చిత్రం ‘గీతాంజలి’కి సీక్వెల్ రానుంది. రాజ కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని  చినబాబు  నిర్మించనున్నారు.త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి చినబాబు మాట్లాడుతూ -‘‘రాజ కిరణ్ ప్రతిభ గల దర్శకుడు. ఈ మధ్యకాలంలో ‘గీతాంజలి’ నాకు బాగా నచ్చిన సినిమా. అందుకని ఆయన దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ నిర్మించాలనుకున్నాను. వర్కింగ్ టైటిల్‌గా ‘సీక్వెల్ ఆఫ్ గీతాంజలి’ అని పెట్టాం. ఓ ప్రముఖ కథానాయిక నటించనున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ కథానాయకుడు నటిస్తారు’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement