‘99’ పేరుతో ‘96’

96 is Being Remade In Kannada - Sakshi

సెన్సేషనల్‌ కోలీవుడ్ హీరో విజయ్‌ సేతుపతి, సీనియర్ హీరోయిన్ త్రిష జంటగా తెరకెక్కిన సూపర్‌ హిట్ మూవీ 96. ప్రేమ్‌ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అ‍ద్భుతమైన రివ్యూస్‌ రావటంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా రికార్డ్‌లు సృష్టించింది. దీంతో ఇతర భాషల్లో 96ను రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తెలుగు రీమేక్‌ హక్కులు సొంతం చేసుకోగా గోపిచంద్‌ హీరోగా నటించే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. కన్నడ దర్శకనిర్మాతలు మరో అడుగు ముందుకేసి ఈ రీమేక్‌ ప్రీ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. గణేష్‌, భావన హీరో హీరోయిన్లుగా ప్రీతం గబ్బి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 99 అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ ప్రీ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top