నాగచైతన్యతో ముగ్గురు కృష్ణులు | 3 Krishnas Queued Up for Naga Chaitanya | Sakshi
Sakshi News home page

నాగచైతన్యతో ముగ్గురు కృష్ణులు

Sep 21 2016 1:26 PM | Updated on Sep 4 2017 2:24 PM

నాగచైతన్యతో ముగ్గురు కృష్ణులు

నాగచైతన్యతో ముగ్గురు కృష్ణులు

ప్రేమమ్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో నాగచైతన్య వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే ప్రేమమ్తో పాటు చైతన్య హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో కూడా....

ప్రేమమ్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో నాగచైతన్య వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే ప్రేమమ్తో పాటు చైతన్య హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో కూడా రిలీజ్కు రెడీగా ఉండగా మరో మూడు సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. అయితే చైతన్య చేయబోయే మూడు సినిమాలకు ముగ్గురు కృష్ణులు దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ షూటింగ్లను పూర్తి చేసిన చైతూ, త్వరలో సొగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించనున్నాడు ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమా తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నాడు చైతూ. ఇప్పటికే ఫైనల్ అయిన ఈ సినిమాను వారాహి చలన చిత్ర బ్యానర్ నిర్మిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తొలిసారిగా ఓ సినిమా అంగీకరించాడు నాగచైతన్య. ఈ సినిమాతో కృష్ణ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement